హుజూర్‌నగర్ బైపోల్ : హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్

Huzurnagar bypoll Teenmar Mallanna files pitetion in High court, హుజూర్‌నగర్ బైపోల్ :  హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్

తెలంగాణలోని హుజూర్‌నగర్‌లో జరుగుతోన్న ఉపఎన్నిక.. ప్రతిష్టాత్మకంగా మారింది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలతో పాటు పెద్ద ఎత్తున ఇండిపెండెంట్ అభ్యర్ధులు సైతం ఇక్కడ పోటీలో నిలిచారు. పోటీ చేస్తున్న అభ్యర్ధులంతా ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇదే స్ధానంలో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా అగ్గిపెట్టె గుర్తుపై పోటీ చేస్తున్న నవీన్‌కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన ఎన్నికల ప్రచారానికి పోలీసులు అడుగడుగునా అడ్డుపడుతున్నారని, తన ప్రచారాన్ని సాగనివ్వడం లేదంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. తనపై మూడు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ పిటిషన్‌లో నవీన్ పేర్కొన్నారు. తన ఎన్నికల ప్రచారానికి ఎలాంటి ఆటంకం కలిగించకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని తీన్మార్ మల్లన్న కోరారు. ఈ పిటిషన్‌లో ఎలక్షన్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ హోం, సూర్యాపేట జిల్లా ఎస్పీ, హుజూర్‌నగర్ ఎస్సైలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఈ బుధవారం మధ్యాహ్నం వాదనలు జరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *