World Biggest Ship: లగ్జరీ అంటే ఇదే.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ విశేషాలేంటో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

|

Jan 29, 2024 | 11:03 AM

ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్​నౌక ఐకాన్​ఆఫ్​ది సీస్​తొలి విహారాన్ని ప్రారంభించింది. రాయల్ కరీబియన్ సంస్థ రుపొందించిన ఈషిప్‌.. సముద్రంలో ప్రయాణాన్ని మొదలెట్టిన అతిపెద్ద క్రూజ్ నౌకగా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్‌ నౌక విహారయాత్ర కొనసాగుతోంది. అమెరికాలోని మియామీ తీరం నుంచి ఈనెల 27న తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది నౌక.

World Biggest Ship: లగ్జరీ అంటే ఇదే.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ విశేషాలేంటో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
World's Largest Cruise
Follow us on

ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్​నౌక ఐకాన్​ఆఫ్​ది సీస్​తొలి విహారాన్ని ప్రారంభించింది. రాయల్ కరీబియన్ సంస్థ రుపొందించిన ఈషిప్‌.. సముద్రంలో ప్రయాణాన్ని మొదలెట్టిన అతిపెద్ద క్రూజ్ నౌకగా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్‌ నౌక విహారయాత్ర కొనసాగుతోంది. అమెరికాలోని మియామీ తీరం నుంచి ఈనెల 27న తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది నౌక. వారం రోజుల పాటు కరీబియన్ దీవులను చుట్టేయనుంది. రాయల్ కరీబియన్ సంస్థకు చెందిన ఈ నౌక అమెరికాలోని ఫోరిడా రాష్ట్రం నుంచి జనవరి 27 సాయంత్రం బయలుదేరింది. వారం రోజుల పాటు సముద్ర జలాలపై విహరిస్తూ వివిధ దీవులను చుట్టేయనుంది. కుటుంబాలతో కలిసి ప్రయాణించే వారికి అత్యుత్తమ అనుభూతిని అందిస్తుంది. ఈ నౌకలో అంత్యంత లేటెస్ట్ సౌకర్యాలు ఉన్నట్లు కరీబియన్ కంపెనీ సీఈఓ జాసన్ లిబర్టీ తెలిపారు.

ఈ నౌకలో మొత్తం 2,350 మంది సిబ్బంది ఉండగా.. ఈ నౌకకు మొత్తంగా 7,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లగల సామర్థ్యం ఉందని చెప్పారు అధికారులు. ఇక రాయల్ కరీబియన్ సంస్థ రుపొందించిన ఐకాన్ ఆఫ్ ది సీన్ మొత్తం 365 మీటర్ల పొడువు ఉంది. దీని బరువు సుమారు 2 లక్షల 50 వేల 800 టన్నులుగా ఉంటుందని అంచనా వేశారు అధికారులు. ఇందులో 20 డెక్కులున్నాయి. ఈ నౌకలో ఆరు వాటర్ స్లైడ్లు, ఏడు స్విమ్మింగ్ పూల్స్ దర్శనమిస్తున్నాయి.

World’s Largest Cruise

అలాగే ఐస్ స్కేటింగ్ రింగ్ సైతం ఏర్పాటు చేశారు. వాటితో పాటు ఒక సినిమా థియేటర్, 40కిపైగా రెస్టారెంట్లు, బార్లు ఏర్పాటు చేశారు. గతేడాది రాయల్ కరీబియన్ సంస్థ రూపొందించిన వండర్ ఆఫ్ ది సీస్ అనే నౌక ఇప్పటి వరకు అతిపెద్ద క్యూజ్ నౌకగా ఉంది. దాని పొడవు 1188 అడుగులు ఉండగా.. అందులో 18 డెక్కులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఐకాన్ ఆఫ్ ది సీన్ దాని రికార్డును తిరగరాసింది. ప్రస్తుతం సముద్రంపై తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన అతిపెద్ద క్రూజ్ నౌకగా రికార్డు సృష్టించింది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..