AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

100, 200, 500 నోట్లపై ఆ గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా..? ఈ సీక్రెట్ తెలిస్తే మీరు అవాక్కవడం పక్కా..

మనం రోజూ వాడే కరెన్సీ నోట్లపై గాంధీ గారి బొమ్మ, ఎర్రకోట లేదా సాంచి స్థూపం వంటి చిత్రాలను చూస్తుంటాం. కానీ నోటు అంచున ఉండే చిన్న చిన్న గీతలను మాత్రం పెద్దగా పట్టించుకోం. అయి, ఆ గీతలు కేవలం అందం కోసం వేసినవి కావు. దృష్టి లోపం ఉన్నవారు కూడా మోసపోకుండా నోటు విలువను గుర్తించేలా ఆర్‌బీఐ ఒక అద్భుతమైన టెక్నిక్‌ను వాడింది. అసలు ఏ నోటుపై ఎన్ని గీతలు ఉంటాయి? అనేది తెలుసుకుందాం..

100, 200, 500 నోట్లపై ఆ గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా..? ఈ సీక్రెట్ తెలిస్తే మీరు అవాక్కవడం పక్కా..
Why Are There Lines On Indian Currency Notes
Krishna S
|

Updated on: Feb 04, 2026 | 5:01 PM

Share

ప్రస్తుతం మన దేశంలో నగదు వాడడం అనేది చాలా తగ్గిపోయింది. కూరగాయల కొట్టు నుంచి పెద్దపెద్ద షాపుల వరకు మొత్తం ఆన్‌లైన్ పేమెంట్స్. దీంతో చాలా మంది డబ్బు క్యారీ చేయడమే మానేశారు. అయితే మన జీవితంలో డబ్బు నోట్లు ఓ భాగం. ప్రతి ఒక్కరూ 100, 200, 500 రూపాయల నోట్లను నిత్యం చూస్తుంటారు. కానీ ఆ నోట్ల అంచున ఉండే చిన్న చిన్న గీతలను మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకోరు. చాలామంది ఇవి కేవలం నోటు డిజైన్ అనుకుంటారు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఈ గీతలను ఒక ప్రత్యేక ఉద్దేశ్యంతో ముద్రించింది. వీటిని ఏమంటారు? ఏ నోటుపై ఎన్ని ఉంటాయో అనేది తెలుసుకోవడం ముఖ్యం.

ఏమిటీ బ్లీడ్ మార్కులు

భారతీయ కరెన్సీ నోట్ల అంచులలో ఉండే ఈ చిన్నపాటి నల్లటి గీతలను బ్లీడ్ మార్కులు అని పిలుస్తారు. ఇవి ప్రధానంగా దృష్టి లోపం ఉన్నవారి కోసం రూపొందించారు. చూపు లేని వారు కరెన్సీ నోటును చేతితో తాకినప్పుడు, ఆ గీతల సంఖ్యను బట్టి అది ఎంత విలువైన నోటో సులభంగా గుర్తించడానికి ఇవి సహకరిస్తాయి.

ఏ నోటుపై ఎన్ని గీతలు ఉంటాయి?

ప్రతి నోటును తాకగానే గుర్తు పట్టేలా ఆర్‌బీఐ ఒక్కో రకమైన సంఖ్యను, డిజైన్‌ను కేటాయించింది.

100 రూపాయల నోటు: ఈ నోటుకు రెండు అంచులలో నాలుగు గీతలు ఉంటాయి. ఈ గీతలు కాస్త ఉబ్బెత్తుగా ఉండటం వల్ల తాకగానే గుర్తుపట్టవచ్చు.

200 రూపాయల నోటు: దీనికి రెండు వైపులా నాలుగు గీతలతో పాటు మధ్యలో రెండు చిన్న వృత్తాకార గుర్తులు ఉంటాయి. ఇవి 100 నోటుకు, 200 నోటుకు మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తాయి.

500 రూపాయల నోటు: ఈ నోటుకు ప్రతి వైపు ఐదు వక్ర రేఖలు ఉంటాయి.

ఆర్థిక స్వతంత్రత కోసం..

సాధారణ ప్రజలకు ఈ గీతల గురించి తెలియకపోయినా ఏం కాదు. కానీ చూపు లేని వారు వీటిపై వేళ్లతో స్పర్శించడం ద్వారా ఇది 100 నోటా లేక 500 నోటా అని కచ్చితంగా చెప్పేస్తారు. దీనివల్ల వారు డబ్బు చెల్లించేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు ఇతరుల సహాయం అవసరం లేకుండా మోసపోకుండా తమ లావాదేవీలను తామే పూర్తి చేసుకోగలుగుతారు. నోటు విలువ పెరిగే కొద్దీ ఈ గీతల సంఖ్య లేదా డిజైన్ మారుతూ ఉంటుంది.

Follow Us
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
ఎన్టీపీసీలో ఉద్యోగం పొందడానికి గొప్ప అవకాశం.. వెంటనే అప్లై చేయండి
ఎన్టీపీసీలో ఉద్యోగం పొందడానికి గొప్ప అవకాశం.. వెంటనే అప్లై చేయండి