Zodiac Sign: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశులు ఉన్నాయి. మనుషులు జన్మించిన వారి జన్మనక్షత్రం, సమయం ఆధారంగా వారి రాశిచక్రాన్ని గుర్తిస్తారు. అయితే, 12 రాశి చక్రాలకు వాటి స్వభావం భిన్నంగా ఉంటుంది. వీటి మాదిరిగానే ఆయా రాశుల వ్యక్తుల స్వభావంలోనూ తేడాలుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కొన్ని రాశు చక్రాల వారు.. ఇతర రాశి చక్రాల వారి కంటే బలవంతులు, శక్తివంతులు, బుద్ధిమంతులు అయి ఉండొచ్చు. ఇలా శృంగారం విషయంలోనూ రాశి చక్రాల ఆధారంగా మనుషులు ఉంటారని చెప్పుకొస్తున్నా పండితులు. ముఖ్యంగా పలు రాశుల వారు అధిక లైంగిక శక్తిని కలిగి ఉంటారట. వారు శృంగారాన్ని ఓ రేంజ్‌లో ఆస్వాధిస్తారట. భాగస్వాముల మధ్య బంధం బలంగా ఉండాలంటే.. శారీరక కలయిక కూడా చాలా ముఖ్యం. అయితే, రాశి చక్రం ఆ వ్యక్తి బెడ్‌పై ఏ విధంగా ప్రభావితం చూపుతాడనేది చెబుతుందట. బంధంలో నిజాయితీ ముఖ్యం. అదే సమయంలో స్థిరమైన సంబంధానికి లైంగిక అనుకూలత కూడా చాలా ముఖ్యం. కొంత మంది వ్యక్తులు తమ సాన్నిహిత్య స్థాయిని పెంచుకోవడానికి తగిన సమయాల్లో ఏం చెప్పాలో, ఏం చేయాలో ముందే అవగాహన కలిగి ఉంటారు. మరి జ్యోతిష్య పండితులు చెబుతున్న ఆ శృంగార అభిలాషులు ఏ రాశివారో ఇకసారి చూద్దాం..
1. మేషం:
ఈ రాశిచక్రం వారితో ఒక చిరస్మరణీయమైన లైంగిక అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. వీరు బెడ్‌పై రెచ్చిపోతారట. ఈ రాశి వారికి శృంగారంపై విపరీతమైన ఆసక్తి ఉంటుందట.
2. మీనం:
మీన రాశివారికి రొమాన్స్ సెన్స్ అధికంగా ఉంటుంది. వీరు ఎప్పుడూ కొత్తగా ప్రయత్నించేందుకు చూస్తారు. వారి భాగస్వామికి ప్రత్యేక అనుభూతిని కలిగించడానికి ప్రయత్నిస్తారు. ఆస్ట్రాలజిస్టులు మీన రాశి వారిని ‘సెక్స్ గాడ్’గా అభివర్ణించారు. వీరు తమ భాగస్వామికి అత్యుత్తమ భావప్రాప్తిని అందిస్తారట.
3. కన్య:
కన్యరాశివారు మంచంపై టార్జాన్ మాదిరిగా వ్యవహరిస్తారట. అందుకే వీరిని ‘సెక్స్ కింగ్’ అని పిలుస్తున్నారు ఆస్ట్రాలజిస్టులు. బెడ్‌పై తమ భాగస్వాములతో చాలా ఉల్లాసంగా, సరదాగా గడుపుతారు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు.
4. క్యాన్సర్:
కర్కాటక రాశి వారికి సెక్స్ అనేది భావోద్వేగ సంబంధం. వారు నిజంగా ప్రేమలో ఉన్న తర్వాత మాత్రమే వారు లైంగిక సంబంధంలోకి ప్రవేశిస్తారు. కర్కాటక రాశి వారు తమ భాగస్వామితో బలమైన అనుబంధాన్ని కలిగి ఉన్నప్పుడు.. వారితో శృంగారం చేయాలనే భావన కూడా పెరుగుతుందట. వీరు లైంగిక ఆనందాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారట.
5. మకరరాశి:
శని ఆధీనంలో ఉండే మకరరాశి వారు.. పడకగదిలో రెచ్చిపోతాటర. శారీరక కలయిక విషయంలో వీరు నెక్ట్స్ లెవల్‌లో ఉంటారట.
6. వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారిలో అధిక లైంగిక శక్తి ఉంటుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. అందుకే వీరిని ‘సెక్స్ సైన్’ అని పిలుస్తున్నారు. బంధం విషయంలో వీరు ఉన్న ప్రమాణాలను కలిగి ఉంటారు. తమతో మమేకమైన వారితోనే వీరు సంబంధాన్ని కొనసాగిస్తారు. అంతేకాదు.. ఈ రాశి చక్రం వారు లైంగికంగా ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉంటారట.
(గమనిక: జ్యోతిష్యశాస్త్రంలోని వివరాలు, ANIలో వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ఏమాత్రం ధృవీకరించడం లేదు)