Sleeping Direction: దక్షిణం వైపు తల పెట్టి పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?

|

Jan 11, 2025 | 2:13 PM

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ వాస్తును పాటిస్తున్నారు. చాలా మంది వాస్తు ప్రకారమే ఇళ్లు, ఆఫీసు, చేసే పని కూడా అనుకూలంగా ఏర్పాటు చేసుకుంటారు. అయితే, వాస్తు ప్రకారం.. దిక్కులు కూడా నిద్ర నాణ్యత, మానసిక స్థితిగతులపై ప్రభావం చూపుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కానీ, కొందరు ఏ దిక్కున పడితే ఆ దిక్కుకు తలపెట్టి పడుకుంటారు. ఇది సరైనది కాదు. దక్షిణం వైపు తల పెట్టి నిద్రించాలని నిపుణులు చెబుతున్నారు. అలా చేస్తే ఏమవుతుందో తెలుసుకుందాం.

Sleeping Direction: దక్షిణం వైపు తల పెట్టి పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?
Sleeping Direction
Follow us on

రాత్రి పడుకునేటప్పుడు తలను తప్పుడు దిశగా పెట్టుకుని పడుకోకూడదు. ఇలా చేయడం వల్ల మీరు సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు అంటున్నారు నిపుణులు. పడుకునేటప్పుడు వాస్తు నియమాలు పాటించాలి. ఈ నియమాలను పాటించకపోవడం మానసిక స్థితిపై చెడు ప్రభావం చూపుతుంది. శరీరానికి అనేక విధాలుగా హాని కలిగిస్తుంది. దక్షిణం వైపు తల పెట్టి నిద్రించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ దిశలో తల పెట్టి పడుకోవడం వల్ల జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుంది మరియు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

దక్షిణం వైపు తల పెట్టి పడుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతారు. దీనితో పాటు, వ్యక్తి జీవితంలో తీవ్రమైన వ్యాధులు ధరిచేరకుండా ఉంటారు. వాస్తు ప్రకారం, దక్షిణ దిశలో తల పెట్టి పడుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో రోజంతా ఫ్రెష్ గా ఉంటారు. దక్షిణం వైపు తల పెట్టి నిద్రిస్తే మంచి నిద్ర వస్తుంది. అదనంగా, శ్రద్ధ, జ్ఞాపకశక్తి, మానసిక స్పష్టత మెరుగుపడతాయి.

వాస్తు ప్రకారం.. పడమర పడమరవైపు తలపెట్టి నిద్రపోవచ్చు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం పడమర వైపు తల పెట్టి పడుకోవడం వల్ల స్థిరమైన నిద్ర ఉండదని చెబుతున్నారు. అంటే నిద్రపడుతుంది కానీ ప్రశాంతమైన నిద్ర ఉండదని అంటున్నారు.. తూర్పు తూర్పువైపు తలపెట్టి నిద్రించడం ఎంతో మంచిదని అంటున్నారు. ఇలా పడుకోవడం వల్ల ధ్యాన నిద్ర కలుగుతుంది. తూర్పువైపు తలపెట్టి నిద్రించడం వలన రక్తప్రసరణ బాగుంటుంది, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మంచి ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఎక్కువమంది తూర్పు వైపు తలపెట్టి నిద్రించాలని సిఫారసు చేస్తారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..