Viral Video: మొసలి సాలిడ్ ఎటాక్.. నోటికి చిక్కిన విషసర్పం.. చివరికి అదిరిపోయే ట్విస్ట్.!

|

Jun 01, 2021 | 10:01 PM

సముద్రపు అలెగ్జాండర్‌గా పిలవబడే మొసలి పట్టు గురించి అందరికి తెలిసిందే.. నీటిలో ఉన్నప్పుడు దాని బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన...

Viral Video: మొసలి సాలిడ్ ఎటాక్.. నోటికి చిక్కిన విషసర్పం.. చివరికి అదిరిపోయే ట్విస్ట్.!
Alligator
Follow us on

సముద్రపు అలెగ్జాండర్‌గా పిలవబడే మొసలి పట్టు గురించి అందరికి తెలిసిందే.. నీటిలో ఉన్నప్పుడు దాని బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏనుగును సైతం తన నోటితో కట్టిపడేయగల బలశాలి. అలాంటి మొసలి నోటికి ఓ పాము చిక్కింది. ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ షాకింగ్‌ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

ఈ వైరల్ వీడియోలో, ఒక పాము నదిలో ఈత కొడుతున్నట్లు మీరు చూడవచ్చు. ఇక ఎప్పటినుంచో ఎర కోసం మాటు వేసిన మొసలి.. నెమ్మదిగా దానిపై వైపుకు వచ్చి పామును దవడలతో పట్టుకుంది. ఆ మొసలి నుంచి తప్పించుకోవడానికి పాము ప్రయత్నించినా.. ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. చివరకు ప్రాణాలు వదిలింది. ఈ వీడియోను ‘లైఫ్ అండ్ నేచర్’ అనే ఖాతా ట్విట్టర్‌లో షేర్ చేశారు. 38 సెకన్ల ఈ వీడియో క్లిప్‌ను ఇప్పటివరకు 20 వేల మందికి పైగా వీక్షకులు వీక్షించారు. అంతేకాకుండా కామెంట్స్, లైకుల వర్షం కురిపిస్తున్నారు.