Viral News: వృద్ధుడిని హత్య చేసిన తేనెటీగలు! మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాంకే..

ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు.. పారిపోతున్నా విడువకుండా వెంటాడి వెటాడి.. కుట్టి కుట్టి చంపాయి. పగ పట్టిన కందిరీగలు.. ఆ వృద్ధుడు ప్రాణాలు వదిలేంత వరకు కుట్టి కుట్టి చంపేశాయి. అవును, కందిరీగలే ఆ పెద్దాయనను హత్య చేశాయి. కందిరీగలు హత్య చేయడం ఏంట్రా బాబూ అని ఆలోచిస్తున్నారా? అవును మరి.. తన పని తాను చేసుకుంటున్న వృద్ధుడిపై తేనెటీగల మంద ఘోరంగా దాడి చేసింది. కుట్టిన చోట కుట్టకుండా.. ఒళ్లంతా కుట్టేయడంతో.. ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అందుకే ఈ కందిరీగలు హంతకులయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Viral News: వృద్ధుడిని హత్య చేసిన తేనెటీగలు! మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాంకే..
Honey Bees

Updated on: Sep 25, 2023 | 8:53 PM

Viral News: ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు.. పారిపోతున్నా విడువకుండా వెంటాడి వెటాడి.. కుట్టి కుట్టి చంపాయి. పగ పట్టిన కందిరీగలు.. ఆ వృద్ధుడు ప్రాణాలు వదిలేంత వరకు కుట్టి కుట్టి చంపేశాయి. అవును, కందిరీగలే ఆ పెద్దాయనను హత్య చేశాయి. కందిరీగలు హత్య చేయడం ఏంట్రా బాబూ అని ఆలోచిస్తున్నారా? అవును మరి.. తన పని తాను చేసుకుంటున్న వృద్ధుడిపై తేనెటీగల మంద ఘోరంగా దాడి చేసింది. కుట్టిన చోట కుట్టకుండా.. ఒళ్లంతా కుట్టేయడంతో.. ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అందుకే ఈ కందిరీగలు హంతకులయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అమెరికాలోని కెంటుకీ రాష్ట్రంలో గల హర్లాన్ కౌంటీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. 59 ఏళ్ల వ్యక్తి తన సొంత నివాసంలో వరండాలో కూర్చున్నారు. అయితే, వరండాలో కాస్త చిందరవందరగా ఉండటంతో.. క్లీన్ చేద్దామని భావించాడు. చెట్ల కుండీలను, ఇతర చెత్తాచెదారాన్ని క్లీన్ చేస్తున్నాడు. అయితే, ఆ ప్రయత్నమే అతని ప్రాణాలు పోవడానికి కారణమైంది. వరంగా క్లీన్ చేసే క్రమంలో ఓ మట్టి కుండను కదిలించాడు. అయితే, దానికి ఆనుకుని తేనెటీగలు.. తేనెతొట్టెను పెట్టాయి. ఆ వృద్ధుడు చూసుకోకుండా ఆ తేనెతుట్టెను కదిలించాడు. దాంతో చెల్లాచెదురైన కందిరీగలు.. ఆ వ్యక్తి పగబట్టినట్లుగా అటాక్ చేశాయి. కందిరీగల దాటికి అతను అక్కడిక్కడే కుప్పకూలి చనిపోయాడు. దీనిని గమనించిన అతని కుటుంబ సభ్యులు.. వృద్ధుడికి సీపీఆర్ చేశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అయిన్పటికీ అతన్ని కాపాడలేకపోయారు. వృద్ధుడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. అతన్ని బ్రతికించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలించలేదని వైద్యులు తెలిపారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకం సృష్టించింది. మరోవైపు ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తేనెటీగలు దాడిలో వ్యక్తి మరణించడంలో అందరూ షాక్‌కు గురయ్యారు. అయితే, బాధితుడి వ్యక్తిగత వివరాలను బయటకు వెళ్లడించేందుకు అతని కుటుంబ సభ్యలు నిరాకరించారని ఏబీసీ న్యూస్ కథనంలో పేర్కొంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..