
పైన ఫోటోలో కనిపిస్తున్న చెప్పుల ధర 8,990 రూపాయలు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే అవి బాత్రూమ్ చెప్పులు. ఒక్కసారే బుర్ర బ్లాంక్ అయ్యింది కదా. లేకపోతే ఏంటి గురూ షాపు వాళ్లు రూ 2 వేలు రేటు చెబితేనే అమ్మో అంటారు. ఇక్కడ బాత్రూమ్ చెప్పులను ఆల్మోస్ట్ 9 వేలకు అమ్ముతున్నారు. లగ్జరీ బ్రాండ్‌లు కస్టమర్ల దృష్టిని ఆకర్షించడానికి తరచుగా తమ ఉత్పత్తులను భారీ ధరలకు విక్రయిస్తాయి. గూచీ కంపెనీ కఫ్తాన్ కుర్తాలను రూ 2.56 లక్షలకు విక్రయించడం నుంచి బాలెన్సియాగా కంపెనీ రూ 1.42 లక్షలకు ట్రాష్ బ్యాగ్‌ను అమ్మడం వరకు ఇలా ఇప్పటివరకు చాలా చూశాం. తాజాగా ఈ గ్రూప్‌లోకి మరో కంపెనీ చేరిపోయింది. హ్యూగో బాస్ కంపెనీ బ్లూ కలర్ ఫ్లిప్-ఫ్లాప్ స్లిప్పర్‌లను రూ 8,990కి విక్రయిస్తోంది. అది కూడా 54 శాతం డిస్కౌంట్ తగ్గించాక అండోయ్.
అవును… వాస్తవంగా చెప్పాలంటే ఈ స్లిప్పర్స్ అసలు ధర రూ 19,500. ప్రతి దేశీ ఇంటిలో కనిపించే బాత్రూమ్ చెప్పులకు, హ్యూగో బాస్ విక్రయిస్తున్న ఈ చెప్పుల మధ్య పెద్ద తేడా కూడా కనిపించడం లేదు. మరి స్పెషల్ ఏందిరా అంటే బ్రాండ్ అంటున్నారు జనాలు. అయినా బాత్రూంకి వేసుకెళ్లే చెప్పులను ఎవరు చూస్తారు చెప్పండి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కంపెనీ నెలకు రూ 500తో ప్రారంభమయ్యే EMI సౌకర్యాన్ని కూడా అందిస్తోంది.
@itmedew హ్యాండిల్‌ని ఉపయోగించే వ్యక్తి ట్విట్టర్‌లో ప్రైజ్ ట్యాగ్‌తో సహా ఈ స్లిప్పర్స్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేయడంతో నెటిజన్స్ స్టన్ అవుతున్నారు. ఇక ఊహించినట్లుగానే చెప్పుల భారీ ధరపై నెటిజన్లు మీమ్స్, జోకులతో చెలరేగిపోతున్నారు. ఆ చెప్పులు కొనే డబ్బుతో చిన్న కుటుంబం నెల రోజులు బ్రతికేస్తుంది అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టగా.. చెప్పుల దొంగతనాలు ఇకపై పెరిగిపోతాయి అని మరొకరు ఫన్నీగా వ్యాఖ్యానించారు.
what the actual fuck pic.twitter.com/mvOvNBmCme
— Dew (@itmedew) October 16, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..