Vastu Tips: చిన్న మార్పులే కానీ జీవితాన్ని మారుస్తాయి.. ఈ వాస్తు చిట్కాలు ఫాలో అయితే..

|

May 12, 2024 | 8:27 PM

భారతీయుల్లో అత్యధికంగా వాస్తును పాటిస్తుంటారు. మరీ ముఖ్యంగా హిందువులు వాస్తును ఎక్కువగా విశ్వసిస్తుంటారు. అందుకే వాస్తుకు అనుగుణంగానే ఇంటి నిర్మాణం ఉండేలా చూస్తారు. కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాకుండా ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటారు...

Vastu Tips: చిన్న మార్పులే కానీ జీవితాన్ని మారుస్తాయి.. ఈ వాస్తు చిట్కాలు ఫాలో అయితే..
Vastu Tips
Follow us on

భారతీయుల్లో అత్యధికంగా వాస్తును పాటిస్తుంటారు. మరీ ముఖ్యంగా హిందువులు వాస్తును ఎక్కువగా విశ్వసిస్తుంటారు. అందుకే వాస్తుకు అనుగుణంగానే ఇంటి నిర్మాణం ఉండేలా చూస్తారు. కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాకుండా ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటారు. వాస్తు నిపుణులు కూడా ఈ విషయాన్ని ముఖ్యంగా చెబుతుంటారు. కొన్ని రకాల చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందొచ్చని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఆ మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మాస్టర్‌ బెడ్‌ రూమ్‌ కచ్చితంగా నైరుతి దిశలో ఉండేలా చూసుకోవాలి. ఇది మనిషి ఆలోచనను, మానసిక స్థితిని స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

* ఇక వంటగది ఎట్టి పరిస్థితిఉలో ఆగ్నేయ దిశలో ఉండేలా జాగ్రత్తపడాలి. అలాగే వంట గదిలో కచ్చితంగా నారింజ రంగును వేసుకోవాలని సూచిస్తున్నారు.

* ఇక బెడ్‌ రూమ్‌లో బెడ్‌ ఎప్పుడూ అటాచ్‌ బాత్‌రూమ్‌లోకి పడకుండా చూసుకోవాల. ముఖ్యంగా బెడ్‌పై పడుకున్న వారి కాళ్లు బాత్‌రూమ్‌లోకి ఉండేలా ఉంటే చెడు ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

* ఇంట్లో గోడలకు వేసుకునే కలర్స్‌ వీలైనంత వరకు లైట్‌గా ఉండేలా చూసుకోవాలి. ఇవి మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.

* ఎట్టి పరిస్థితుల్లో బెడ్‌ రూమ్‌లో ఏర్పాటు చేసే డ్రస్సింగ్ టేబుల్‌లో మంచం పడకుండా చూసుకోవాలి. ఒకవేళ ఇలా ఉంటే భార్యత భర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.

* ఇంటికి ఈశాన్య మూల కచ్చితంగా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఈశాన్యంలో ఎలాంటి బరువైన వస్తవులు లేకుండా ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి.

* రాత్రి నిద్రించే సమయంలో తల కచ్చితంగా దక్షిణ దిశలో ఉండేలా జాగ్రత్తపడాలని వాస్తు పండితులు చెబుతున్నారు.

* ఇంట్లో కుటుంబ సభ్యుల ఫొటోలను నైరుతి దిశలో ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు హెల్తీగా ఉంటాయని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం క్లిక్‌ చేయండి..