రెస్టారెంట్‌లో సలాడ్ ఆర్డర్ ఇచ్చిన మహిళ.. తెగిన వేలు నమిలడంతో షాక్.. రెస్టారెంట్‌పై కేసు

|

Nov 30, 2023 | 9:00 PM

రెస్టారెంట్ లో ఇష్టమైన ఆహారం సలాడ్‌ని తినే సమయంలో ఒక వ్యక్తి తెగిపోయిన వేలు కనిపిస్తే .. అప్పుడు ఎవరి పరిస్థితి అయినా ఎలా ఉంటుంది.. అమెరికాలోని కనెక్టికట్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. ఒక మహిళ  సలాడ్ లో ఓ ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుంది. అయితే తాను నమిలింది సలాడ్ కాదు ఓ తెగిపోయిన వేలిని అని గ్రహించింది. బాధిత మహిళ రెస్టారెంట్‌పై కేసు పెట్టింది.

రెస్టారెంట్‌లో సలాడ్ ఆర్డర్ ఇచ్చిన మహిళ.. తెగిన వేలు నమిలడంతో షాక్.. రెస్టారెంట్‌పై కేసు
Human Finger In Salad
Follow us on

రెగ్యులర్ ఫుడ్ కి భిన్నంగా ఉండాలని చాలా మంది రెస్టారెంట్‌లో విభిన్నమైన ఆహారం కోసం వెళ్లారు. తమకు నచ్చిన మెచ్చిన రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తూ తింటారు. అయితే ఇష్టమైన ఆహారం తింటుంటే.. ఇంతలో అనుకోని విధంగా ఎలుక, బల్లి వంటివి కనిపిస్తే అప్పుడు వారి పరిస్థితి గురించి ఎంత చెప్పినా తక్కువే.. అలా రెస్టారెంట్ లో ఇష్టమైన ఆహారం సలాడ్‌ని తినే సమయంలో ఒక వ్యక్తి తెగిపోయిన వేలు కనిపిస్తే .. అప్పుడు ఎవరి పరిస్థితి అయినా ఎలా ఉంటుంది.. అమెరికాలోని కనెక్టికట్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. ఒక మహిళ  సలాడ్ లో ఓ ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుంది. అయితే తాను నమిలింది సలాడ్ కాదు ఓ తెగిపోయిన వేలిని అని గ్రహించింది. బాధిత మహిళ రెస్టారెంట్‌పై కేసు పెట్టింది.

nypost నివేదిక ప్రకారం గ్రీన్ విచ్ కి చెందిన అల్లిసన్ కోజీ ఈ సంవత్సరం ఏప్రిల్ 7న న్యూయార్క్‌లోని ప్రముఖ రెస్టారెంట్ ‘చాప్ట్’ నుండి సలాడ్‌ను ఆర్డర్ చేసినట్లు చెప్పింది. తనకు సలాడ్‌లో వడ్డించారని.. అయితే అది సలాడ్ కాదని.. అందులో మరేదో ఉందని.. ఆ విషయం తాను ఓ ముక్క నమలుతున్నప్పుడు తనకు అర్థమైందని ఆ మహిళ ఆరోపించింది.

ప్రమాదవశాత్తూ రెస్టారెంట్ మేనేజర్ తన వేలు కోసుకున్నాడని దావాలో పేర్కొన్నారు. ఒక రోజు ముందు మేనేజర్ సలాడ్ కోసం కూరగాయలు కట్ చేసాడు. అప్పుడు అతని వేలు తెగిపోయింది. వెంటనే అతడిని  ఆస్పత్రికి తరలించారు. అయితే తెగిపడిన వేలు భాగం కూరగాయల్లోనే ఉండిపోయింది. ఆ కూరగాయలతో సలాడ్ ను తయారు చేశారు. ఆ సలాడ్ ను రెస్టారెంట్ కు వచ్చిన మంది కస్టమర్‌లకు అందించారు. అలా సలాడ్ అందుకున్న కస్టమర్స్ లో అల్లిసన్ కోజీ కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

సలాడ్‌లో వేలును చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యానని అల్లిసన్ కోజీ ఆరోపించింది. ఆమె చాలా ఉద్వేగానికి లోనైంది. అంతేకాదు ఫింగర్ సలాడ్ తిన్న తర్వాత తనకు మెడ, భుజాలలో నొప్పి మొదలైందని  ఫిర్యాదు చేసింది. మహిళ తరపున కేసు నమోదు చేసిన తర్వాత ఆరోగ్య శాఖ ఆ రెస్టారెంట్ పై $ 900 జరిమానా విధించింది.

అయితే ఇదే మొదటి సంఘటన కాదు. అంతకుముందు 2016లో కాలిఫోర్నియాలోని ఒక గర్భిణీ స్త్రీ తనకు వడ్డించిన సలాడ్‌లో బ్లడీ వేళ్లు ఉన్నట్లు ఆపిల్‌బీ రెస్టారెంట్‌పై ఆరోపించింది. 2012లో మిచిగాన్‌లో ఇదే విధమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఒక యువకుడు కాల్చిన బీఫ్ శాండ్‌విచ్‌లో కత్తిరించిన వేలు వచ్చిందని  పేర్కొన్నాడు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..