Twins Village: దేశంలో అత్యధిక సంఖ్యలో కవలలు జన్మించిన గ్రామం కూడా ఉంది. కవల పిల్లలు కనిపించడం చాలా అరుదుగా చూస్తుంటాము. ఏ గ్రామంలోనైనా కవల పిల్లలు ఉంటే మహా అయితే ఇద్దరు, నలుగురిని చూస్తుంటాము. ఒకే గ్రామంలో ఎక్కువ మంది కవల (Twins) పిల్లలు ఉండటం అనేది అరుదు. కానీ ఈ గ్రామంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 400 జతల కవల పిల్లలు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేరళ (Kerala)లోని మణప్పపురం జిల్లా కోడిని (Kodinhi) గ్రామంలో అత్యధిక సంఖ్యలో కవలలు ఉన్నారు. ఇలా కవలలు ఎందుకు పుడతారనేది శాస్త్రవేత్తలకు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ది న్యూస్ మినిట్ కథనం ప్రకారం.. 2000 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో 400 జతల కవలలు ఉన్నారు. ఈ గ్రామాన్ని జంట గ్రామం అని కూడా అంటారు.
ఈ గ్రామంలో నివసించే 46 ఏళ్ల శంసద్ బేగం తమకు 19 సంవత్సరాల క్రితం కవల కుమార్తెలు ఉన్నారని చెప్పారు. వారి పేర్లు షాజారా, ఇషానా. కుటుంబంలో రెట్టింపు సంతోషం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని చెప్పింది. అయితే కవలలు కొందరికి ఆనందానికి కారణం కాగా, మరి కొంత మంది ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ గ్రామంలో ఆటోరిక్షా డ్రైవర్‌గా పనిచేస్తున్న అభిలాష్ తనకు ఇద్దరు కవలలు ఉన్నారని చెప్పారు. ఈ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సాయం అందించలేదని ఆయన పేర్కొంటున్నారు. ఇప్పుడు 4 పిల్లల వల్ల ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని చెబుతున్నాడు.
గ్రామానికి శాస్త్రవేత్తలు..
ఈ గ్రామంలో ఇంత మంది కవల పిల్లలు ఎందుకు పుడుతున్నారనే దాని గురించి తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. వీటిలో సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, యూనివర్సిటీ ఆఫ్ లండన్, హైదరాబాద్, కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ ఉన్నాయి. ఈ రహస్యాన్ని ఛేదించడానికి పరిశోధకులు లాలాజలం, వెంట్రుకల నమూనాలను తీసుకున్నారు. అలాగే DNA పరీక్షలు జరిపారు.
జన్యుపరమైన కారణాల వల్ల ఇలా జరుగుతోందని పలువురు శాస్త్రవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నట్లు కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ పరిశోధకుడు ప్రొఫెసర్ ఇ ప్రీతమ్ చెప్పారు. వివిధ సంస్థలు చేసిన పరిశోధనలు షాకింగ్ వివరాలు ఏమీ వెల్లడికాలేదని తెలిపారు.
ఇవి కూడా చదవండి: