తెల్లని బట్టలపై ఉన్న మొండి మరకలు వదలడం లేదా..? ఈ సింపుల్ చిట్కాలతో ట్రై చేయండి..!

మనందరి వార్డ్‌రోబ్‌లో తెల్లటి దుస్తులు తప్పనిసరిగా ఉంటాయి. అయితే వాటిని శుభ్రంగా ఉంచడం చాలా కష్టమైన పని. మరకలు పడితే వాటిని తొలగించడం మరింత సవాలుగా మారుతుంది. దీనికి ఆందోళన చెందకండి. మీ తెల్లటి దుస్తులను కొత్త వాటిలా మెరిసేలా చేయడానికి కొన్ని అద్భుతమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

తెల్లని బట్టలపై ఉన్న మొండి మరకలు వదలడం లేదా..? ఈ సింపుల్ చిట్కాలతో ట్రై చేయండి..!
White Clothes

Updated on: Jan 30, 2025 | 9:09 PM

మీ వైట్ షర్ట్ ను క్లీన్ గా, మెరిసేలా ఉంచడానికి కొన్ని సింపుల్ చిట్కాలను ఫాలో అయితే చాలు. ఇది మీ వైట్ షర్ట్ ని షాప్ లో నుండి తెచ్చినట్లు కొత్త దానిలా మారుస్తుంది. ఇలా మార్చడానికి రాతి ఉప్పు, నిమ్మకాయ చాలు.

చాలా మందికి వైట్ కలర్ క్లాత్స్ ఉంటూనే ఉంటాయి. కానీ వాటిని మెయింటనెన్స్ చేయడం కొంచం కష్టంగా ఉంటుంది. దీని కారణంగా ఇష్టంగా కొనుక్కున్న ఈ బట్టలను తరచుగా వేసుకోవడానికి వెనకాడతాం. వైట్ కలర్ బట్టలపై మరకలు పడితే వాటిని ఉతకడం కష్టంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. వీటిని సింపుల్ గా ఉతకడానికి ఒక రహస్యం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బకెట్ నీటిలో వైట్ కలర్ బట్టలకు సరిపడా సర్ఫ్ వేయండి. దీంట్లో ఒక స్పూన్ వాషింగ్ సోడాను కూడా కలపండి. అలాగే కొద్దిగా నిమ్మరసం, ఒక గుప్పెడు రాతి ఉప్పు వేసి కలపాలి. వీటన్నింటినీ కలిపిన నీటిలో బట్టలను 20 నిమిషాలు పాటు నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని నీటిలో నుండి తీసి చూడండి. బట్టలకు ఉన్న మురికి తొలగిపోతుంది. అయితే ఏవైనా మొండి మరకలు మిగిలి ఉంటే ఆ చోట కొద్దిగా వాషింగ్ సోడా, నిమ్మరసం వేసి బ్రష్‌తో రుద్దండి ఇలా చేస్తే బట్టలు షాప్ లో నుండి ఇప్పుడే తెచ్చినట్లు కొత్త వాటిలా మెరుస్తాయి.

ఈ సింపుల్ చిట్కాలను తెల్లటి బట్టలను ఉతకడానికి మాత్రమే ఉపయోగించాలి. ఇతర రంగుల బట్టలను ఇలా ఉతికితే వాటిలోని రంగు పోతుంది. అలాగే తెల్లటి బట్టలను ఎప్పుడూ కూడా వేరే రంగుల బట్టలతో కలిపి వాషింగ్ మెషీన్‌లో వేయకూడదు. ఇలా వేస్తే ఇతర బట్టల రంగు, మురికి అంతా కూడా ఈ తెల్లటి బట్టలకు పట్టేస్తుంది జాగ్రత్త. రంగుల బట్టలను కూడా ఉతికిన తర్వాత ఎండలో వేయకూడదు. బట్టలకు ఉన్న కలర్ అంతా పోతుంది. నీడలో ఆరబెట్టడమే ఉత్తమం. నీడలో ఆరేయడం వల్ల రంగు పోదు. ఈ సింపుల్ టిప్ ని ట్రై చేసి చూడండి. మంచి రిజల్ట్ ఉంటుంది.