Today Silver Rates in India: అంతర్జాతీయ మార్కెట్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన వెండి.. నేడు దేశీయంగా కేజీ వెండి ధర ఎంతంటే..

|

Dec 23, 2020 | 5:27 AM

ఇంతింతై వటుడింతై అన్నట్లుగా వరుసగా భారీ మొత్తంలో పెరుగుతూ కోనుగోలు దారులను బెంబేలెత్తించిన సిల్వర్ ధరలు నేడు నేల చూపులు చూశాయి.

Today Silver Rates in India: అంతర్జాతీయ మార్కెట్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన వెండి.. నేడు దేశీయంగా కేజీ వెండి ధర ఎంతంటే..
Follow us on

Today Silver Rates in India:  ఇంతింతై వటుడింతై అన్నట్లుగా వరుసగా భారీ మొత్తంలో పెరుగుతూ కోనుగోలు దారులను బెంబేలెత్తించిన సిల్వర్ ధరలు నేడు నేల చూపులు చూశాయి. స్ట్రెయిన్ వైరస్ కారణంగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో బంగారం, వెండికి డిమాండ్ పడిపోయాయి. దాంతో వాటి ధరలు అమాంతం పడిపోయాయి. నిన్న ఒకేసారి రూ.2 వేలకు పైగా పెరిగి బెంబేలెత్తించిన వెండి ధర.. నేడు రూ. 216 మేర స్వల్పంగా తగ్గింది. దాంతో ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కేజీ సిల్వర్ కు రూ. 67,177 పలుకుతోంది. ఇక మంగళవారం నాడు అయితే రూ. 67,393 పలికింది. అంతర్జాతీ మార్కెట్‌లోనూ సిల్వర్ రేట్ల పరిస్థితి అలాగే ఉంది. ఔన్స్ వెండి ధర $ 25.70 వద్ద ట్రేడ్ అవుతోంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో అమెరికా $900 బిలియన్ డాలర్ల ఉద్దీపణ ప్యాకేజీ ప్రకటించడంతో దాని ప్రభావం బంగారం, వెండిపై పడిందని నిపులుణులు చెబుతున్నారు.

 

Also read:

urvashi rautela: విశ్వసుందరి కిరీటాన్ని గెలిచి ఐదేళ్లు పూర్తి.. సోషల్ మీడియాలో వీడియో.. హీట్ పెంచిన బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ..

Xiaomi Mi 11 Series: సరికొత్త ఫీచర్లతో షియోమీ ఎంఐ 11 సిరీస్ 5జీ స్మార్ట్ ఫోన్.. త్వరలో ఇండియా మార్కెట్‌లోకి విడుదల..