Tips for Rid of Ants: ఇంట్లో చీమల బెడద వేధిస్తోందా? అయితే, ఈ చిట్కాలతో చీమలకు చెక్ పెట్టండి..

Tips for Rid of Ants: చాలా మంది ఇళ్లలో చీమల బెడద ఉంటుంది. వంటింట్లో, బెడ్ రూమ్‌లో ఇలా ఎక్కడ పడితే అక్కడ చీమలు కుప్పలు కుప్పలుగా..

Tips for Rid of Ants: ఇంట్లో చీమల బెడద వేధిస్తోందా? అయితే, ఈ చిట్కాలతో చీమలకు చెక్ పెట్టండి..
Ants
Follow us

|

Updated on: Jun 25, 2022 | 10:56 AM

Tips for Rid of Ants: చాలా మంది ఇళ్లలో చీమల బెడద ఉంటుంది. వంటింట్లో, బెడ్ రూమ్‌లో ఇలా ఎక్కడ పడితే అక్కడ చీమలు కుప్పలు కుప్పలుగా ఉంటాయి. ఒకచోట బాట దారి ఏర్పాటు చేసుకుంటే.. ఎక్కడ ఎండ్ చేస్తాయో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. చిన్న పిల్లలు ఉంటే ఇంకా పెద్ద కష్టంగా ఉంటుంది. పిల్లలు వాటి దగ్గరకు వెళ్లడం, అవి వారిని కుట్టడం, పరిస్థితి చాలా ఇబ్బందికరం అనే చెప్పాలి. ఇంకా చీమలు వంటింట్లోకి ప్రవేశిస్తే రచ్చ రచ్చే. వంటకాల్లోకి చీమలు వెళతాయి. ఇలా చీమలతో కరరకాల సమస్యలు వస్తాయి. అయితే, చీమల బెడద నుంచి బయటపడేందుకు వంటింటి చిట్కాలు అద్భుతంగా పని చేస్తాయి. చీమలను ఇంట్లో నుంచి పంపించేందుకు అద్భుతమైన ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సుద్ద ముక్క: చీమలను నివారించడంలో సుద్ద చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఎందుకంటే.. ఇందులో ఉండే కాల్షియం కార్బోనేట్ చీమలకు చిరాకు తెప్పిస్తాయి. దాంతో అవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. చీమలు వచ్చే స్థానంలో సుద్దతో గీతలు గీస్తే అవి అక్కడి నుంచి వెళ్లిపోతాయి.

మిరియాలు: చీమలు స్వీట్లను ఇష్టపడతాయి, కానీ మిరియాలను ద్వేషిస్తాయి. చీమలు వంటగది, ఇంట్లోకి వచ్చినప్పుడు.. అవి ఉన్న ప్రదేశంలో నల్ల మిరియాలను చల్లాలి. వాటి నుంచి వచ్చే ఘాటు వాసనను తట్టుకోలేక చీమలు అక్కడి నుంచి వెళ్లిపోతాయి.

దాల్చిన చెక్క: వంటగదిలో తేలికగా లభించే దాల్చిన చెక్క కూడా చీమలను తరిమికొట్టడానికి కూడా ఉపకరిస్తుంది. దాల్చిన చెక్క పొడిని తయారు చేసి చీమలు ఉన్న చోట చల్లాలి. దెబ్బకు చీమలు సెలవు చెప్పి పరారవుతాయి.

పసుపు: ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న పసుపు.. చీమల సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది. ఇంట్లోని చీమలను తరిమేందుకు పసుపు అద్భుతంగా పని చేస్తుంది. ఎర్ర చీమలు దాని వాసన చూసే ఇంటి నుంచి పారిపోతాయి.