TMC, CUSEC: టీఎంసీ, క్యూసెక్‌.. ఈ పదాలకు అర్థం ఏమిటో తెలుసా..?

|

Jul 15, 2022 | 10:51 AM

TMC, CUSEC: సాధారణంగా నదులకు వరదలు వచ్చిన సమయంలో TMC, CUSEC (టీఎంసీ, క్యూసెక్కు) అనే మాటలు మనం వింటూ ఉంటాం. కానీ వాటి గురించి చాలా మందికి పెద్దగా తెలిసి ఉండదు..

TMC, CUSEC: టీఎంసీ, క్యూసెక్‌.. ఈ పదాలకు అర్థం ఏమిటో తెలుసా..?
Follow us on

TMC, CUSEC: సాధారణంగా నదులకు వరదలు వచ్చిన సమయంలో TMC, CUSEC (టీఎంసీ, క్యూసెక్కు) అనే మాటలు మనం వింటూ ఉంటాం. కానీ వాటి గురించి చాలా మందికి పెద్దగా తెలిసి ఉండదు. భారీ వర్షాలు కురిసిన సమయంలో ప్రాజెక్టు నీటితో నిండి ఉండే సామర్థ్యం. అలాగే ప్రాజెక్టు నుంచి దిగువన వదిలే నీటిని క్యూసెక్కుల రూపంలో లెక్కిస్తారు. ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటి పరిమాణం చెప్పటానికి ఉపయోగించే ప్రమాణము టీఎంసీ (TMC) అంటే THOUSAND MILLION CUBIC FEET అని అర్థం. మనం ఒక టీఎంసీ విలువ 2,830 కోట్ల లీటర్లు ఉంటుంది.

ఇక క్యూసెక్ (CUSEC) అనేది నీటి ప్రవాహ వేగాన్ని కొలిచే ప్రమాణం. CUSEC అంటే CUBIC FEET PER SECOND అని అర్థము. దీని విలువ సెకనుకు 28 లీటర్ల అవుతుంది. బ్యారేజ్ గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీరు విడుదల చేశాము అంటే ఒక సెకను కాలంలో గేట్ల ద్వారా 28 లక్షల లీటర్ల నీరు విడుదలైంది అని అర్థం. నీరు నిల్వ గురించి మాట్లాడినప్పుడు టీఎంసీలలో, నీటి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో గురించి మాట్లాడితే క్యూసెక్కులలో చెప్పాలి.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులన్ని నిండుకుండాలా మారిపోయాయి. కొన్ని ఇప్పటికే తెలంగాణలోని పలు ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువన వదులుతున్నారు. గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రచలం వద్ద నీటి ఉధృతి పెరుగుతుండటంతో 36ఏళ్ల రికార్డును చెరిపేస్తూ గోదావరి మహోగ్రంగా ప్రవహిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి