కార్ విండ్‌షీల్డ్‌పై కనిపించే ఈ నల్లని చుక్కలు కేవలం డిజైన్ మాత్రమే కాదు.. ఇవి మీకు సెక్యూరిటీని ఇస్తాయి.. ఎలా అంటారా..

మీరు కారు విండ్‌షీల్డ్‌పై నల్ల చుక్కలను చూసి ఉంటారు. కారు విండ్‌షీల్డ్‌పై కనిపించే ఈ నల్లని చుక్కలు ఎందుకు ఇవ్వబడుతున్నాయనే దానికి మనలో చాలా మంది వద్ద సమాధానం ఉండదు. దీని వెనుక పెద్ద విషయం ఉంది.

కార్ విండ్‌షీల్డ్‌పై కనిపించే ఈ నల్లని చుక్కలు కేవలం డిజైన్ మాత్రమే కాదు.. ఇవి మీకు సెక్యూరిటీని ఇస్తాయి.. ఎలా అంటారా..
Black Dots On The Car Windshield
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 04, 2023 | 10:56 AM

మనలో చాలా మందికి కారు ఉంటుంది. కాని దానికి సంబంధించిన సమాచారం తెలిసి ఉండదు. కారులో ఏదైన చిన్న సమస్య వచ్చినా మెకానిక్ షెడ్‌ వద్దకు పరుగులు పెడుతుంటాం. ఈ విషయంలో చాలా మంది విచిత్రమైన సమాధానం చెబుతుంటారు. కారులో సీట్ బెల్ ముందు సీట్లకు మాత్రమే కాకుండా వెనుక సీట్లకు కూడా విడి విడిగా ఉంటాయి. అయితే సీట్ బెల్డ్ ముందున్నవారు మాత్రమే పెట్టుకోవాలని వెనుక ఉన్నవారు నిర్లక్ష్యం చేసుకుంటారు. అయితే మన కారు విండ్‌షీల్డ్‌పై నలుపు రంగు చుక్కలు ఉండటాన్ని మీరు చాలా సార్లు చూసి ఉంటారు. ఇవి దాదాపు అన్ని కార్లలో ఉంటాయి. అయినప్పటికీ వాటి డిజైన్ భిన్నంగా ఉండవచ్చు. చాలా కార్లలో ఇది గుండ్రంగా ఉంటుంది.

అవి ఎందుకు ఇవ్వబడ్డాయి అని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా..? కారు మొత్తం విండ్‌షీల్డ్ పారదర్శకంగా ఉన్నప్పుడు.. ఈ డిజైన్ సైడ్ పార్ట్‌లో మాత్రమే ఎందుకు ఏర్పాటు చేశారు..? కారు విండ్‌షీల్డ్‌పై కనిపించే ఈ నల్లని చుక్కలు ఎందుకు ఇవ్వబడుతున్నాయనే దానికి సమాధానం తెలుసుకుందాం.

అసలు కథ ఇదే..

ఈ చుక్కలను నిజానికి ఫ్రిట్స్ అంటారు. ఇవి విండ్ స్క్రీన్ అంచుల చుట్టూ తయారు చేయబడ్డాయి. ఇవి అంచున గట్టి నల్లగా ఉంటాయి. బయటి అంచుకు వచ్చే చిన్న చుక్కలలో ఉంటాయి. విండ్‌షీల్డ్‌తో పాటు, విండో గ్లాస్‌పై కూడా ఇవ్వబడింది. ఒకటి రెండు కాదు.. 4 కారణాలు చెప్పాలి.

1. వారి మొదటి ప్రయోజనం ఏంటంటే అది గ్లాస్, కారు ఫ్రేమ్‌ను కనెక్ట్ చేయడం. ఇది ఉపరితలాన్ని స్ట్రాంగ్‌గా చేస్తుంది. అవి గాజు, గమ్ మధ్య బలమైన పట్టుగా పనిచేస్తాయి.

2. రెండవది, ఇది గాజుకు వర్తించే గమ్‌ను సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది సూర్యుని అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణగా నిలుస్తుంది. ఇది కిటికీలను వాటి స్థానంలో గట్టిగా ఉంచుతుంది.

3. నల్ల చుక్కల మూడవ ప్రయోజనం ఏంటంటే.. ఎండ తీవ్రత నుంచి కారు లోపల ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడతాయి.

4. కారును ఆకర్షణీయంగా మార్చేందుకు కూడా సహాయం చేస్తుంది. ఈ చుక్కలు తగ్గడం లేదా రంగు మారడం ప్రారంభించినట్లయితే.. వాటిని వెంటనే మార్చేయాలి. వీటిని డ్యామేజ్ చేయడం వల్ల గ్లాస్ విప్పి ఫ్రేమ్ బయట పడవచ్చు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం