Diabeties: డయాబెటీస్ ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న సమస్య. ఒక్కసారి వచ్చిందంటే.. దాని నియంత్రణకు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇక తాజా అధ్యయనాల్లో కొరోనరీ ఆర్టరీ వ్యాధి ఉన్న రోగులలో దాదాపు 30 శాతం మందికి డయాబెటిస్ ఉందని తేలింది. ఇది సాధారణ జనాభాలో 9 శాతం మధుమేహం వ్యాప్తితో పోల్చబడింది. గల్ఫ్ దేశాలలో 60 శాతం గుండె జబ్బులు ఉన్న రోగులలో డయాబెటిస్ ఉన్నట్లుగా తెలిసింది. అలాగే ఐరాపాలో 20 శాతం వరకు ఉంది.
ఉబకాయం, వ్యాయామం లేకపోవడం వలన ఎక్కువగా డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదాలున్నట్లుగా అధ్యాయనంలో తేలింది. ఇక పోషకాహార విలువలను మెరుగుపరచడంతోపాటు, అత్యవసరం సదుపాయాన్ని ఇంప్రూవ్ చేస్తాయని పారిస్లోని బిచాడ్-క్లాడ్ బెర్నార్డ్ హాస్పిటల్ అధ్యాయన నిపుణులు డాక్టర్ ఇమ్మాన్యుల్లె విడాల్. పెటియేట్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డయాబెటిస్ భారిన పడిన దేశాలలో ఎక్కువగా ఉబకాయంతో బాధపడుతున్నారని.. ఇందుకు కారణం శరీరానికి తగిన శ్రమ లేకపోవడంతోపాటు ఈ మార్పులు జరుగుతున్నట్లుగా తెలిపారు.
ప్రస్తుత సమాచారం ప్రకారం యూరప్, ఆసియా, అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, ఆఫ్రికాలోని 45 దేశాల నుంచి సిండ్రోమ్లతో 32,694 మంది రోగులున్నారు. 2009 నుంచి 2010 వరకు నమోదైన రోగులను ఐదు సంవత్సరాల నుంచి పరీక్షలు జరిపారు. తాజా అధ్యయనం ప్రకారం డయాబెటిస్ లేని వారితో పోలిస్తే.. డయాబెటిస్ ఉన్న వారిలో గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయని తెలీంది. అలాగే మధుమేహం ఉన్నవారిలో కొన్ని బలహీన మార్పులను డయాబెటిస్ లేనివారితో పోల్చగా.. వారి వయసు, జెండర్, స్మోకింగ్ స్టేటస్, బ్లడ్ ప్రెషర్, మెడికేషన్స్, మిగతా పరిస్థితులపై పరిశోధనలు జరిపారు. ఇందులో కొరోనరీ హార్ట్ డిసీజ్ ఉన్న రోగులలో డయాబెటిస్ ఉన్నవారిపై ఐదేళ్లలో జరిపిన పరీక్షలలో 38 శాతం అధిక మరణాల రేటు ఉందని తెల్చారు. గుండెపోటు, స్ట్రోక్ వంటి వాటితో ఈ ప్రమాదం 28 శాతం వరకు అధికంగా ఉందని తెలీంది. డయాబెటీస్ ఉన్నవారికి జెండర్తో సంబంధం లేకుండా.. గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉందని తెల్చారు.
ఇందుకు ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిని అంచనా వేయలేమని తెలిపారు. అలాగే బరువు నియంత్రణ. వ్యాయమం వలన మధుమేహం వచ్చే అవకాశాలను తగ్గించవచ్చని.. రక్తంలో షుగల్ లెవల్స్ నియంత్రించడానికి ఇది ముందుగానే గుర్తించాలి. గుండె జబ్బులు, మధుమేహం ఉన్నవారికి కూడా అవసరం మంచి జీవనశైలి, మంచి ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి ధూమపానం అలవాట్లను మానుకోవాలని హెచ్చరిస్తున్నారు.
Also Read: రోడ్డెక్కిన ‘కార్తీకదీపం’.. డాక్టర్ బాబు.. వంటలక్క కలవాలంటూ ఫ్లెక్సీలు.. ఎక్కడో తెలుసా..