Ration Card Application Process: కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేస్తున్నారా ? తెలంగాణలో రేషన్ కార్డుకు ఇలా అప్లై చేయండి..

|

Feb 11, 2021 | 7:46 AM

దిగువ మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ కార్డు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆధార్ వచ్చినా కూడా రేషన్ కార్డుకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. సబ్సీడీ

Ration Card Application Process: కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేస్తున్నారా ? తెలంగాణలో రేషన్ కార్డుకు ఇలా అప్లై చేయండి..
how to download ration card
Follow us on

Telangana Ration Card Application Procedure: దిగువ మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ కార్డు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆధార్ వచ్చినా కూడా రేషన్ కార్డుకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. సబ్సీడీ ధరకు రేషన్ సరుకులను పొందటమే కాదు. ఆరోగ్య శ్రీ, పలు రకాల ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలకు రేషన్ కార్డు సంజీవనిగా మారింది. అయితే రేషన్ కార్డు కొత్తది తీసుకోవాలన్నా.  భార్య లేదా పిల్లల పేర్లను పొందుపరచాలన్నా  ఇప్పుడు మీ సేవలో  కొన్ని సింపుల్ స్టెప్ట్స్ ఫాలో అయితే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

తెలంగాణాలో రెండు రకాల రేషన్ కార్డులు చెలామణిలో ఉన్నాయి.
ఒకటి వైట్ రేషన్ కార్డు. రెండు పింక్ రేషన్ కార్డు.
ఆర్థిక స్థోమత ఆధారంగా పావర్టీ లైన్‌కి దిగువన ఉన్నవారికి వైట్ కార్డు ఇస్తారు. పావర్టీ లైన్‌కి ఎగువన ఉన్నవారికి పింక్ కార్డు తీసుకునే సౌలభ్యం ఉంది.
కాగా ఏ ప్రాసెస్‌లో అర్జీ పెట్టుకున్నా కార్డు రావడానికి వారం రోజుల టైమ్ పడుతుంది.
రేషన్ కార్డు కావాలనుకున్నవారు మొదట దరఖాస్తు ఫారం తీసుకోవాలి.

ఇవి అన్ని మీసేవ కేంద్రాల్లో లభిస్తాయి. మీసేవ అధికారిక వెబ్‏సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా తెలంగాణ మీసేవా వెబ్ సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా మీరు మీసేవా వెబ్ సైట్ ఓపెన్ చేసాక.. మీసేవా సర్వీస్ ఫార్మ్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అందులో వివిధ రకాల డిపార్ట్ మెంట్స్ ఫార్మ్స్ కనిపిస్తాయి. అలాకాకుండా నేరుగా tg.meeseva.gov.in/DeptPortal/Meeseva-Applications లింక్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత సివిల్ సప్లైస్ డిపార్ట్ మెంట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకున్నాక.. అప్లై న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనేదానిపై సెలక్ట్ చేయాలి. అనంతం దరఖాస్తు ఫారంను డౌన్‌లోడ్ చేసుకొని ఫారంను ఫ్రింట్ తీసుకోవాలి. ముందుగా ఫారంలో స్పష్టమైన సమాచారాన్ని భర్తీ చెయ్యాలి. అంటే దరఖాస్తుదారుడి పేరు, వయస్సు, తండ్రి పేరు, అడ్రస్, మొబైల్ నంబర్, జిల్లా, ఫ్యామిలీ మెంబర్స్ నంబర్స్ ఇలా అన్ని వివరాలను జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్‏ను జతచేయాలి.

అవసరమైన డాక్యుమెంట్లు..

ఒరిజినల్ రెసిడెన్షియల్ ప్రూఫ్.
ఓటర్ కార్డు లేదా ఆధార్ కార్డు ప్రూఫ్.
దరఖాస్తుదారుడి పాస్‏పోర్ట్ సైజ్ ఫోటో
అర్హత: భారతీయులై ఉండాలి.

సంతకం లేదా వేలిముద్ర విషయంలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఆ సమయంలో పెట్టినవే జీవితాంతం కొనసాగుతాయి.
ఫీజును, దరఖాస్తు ఫారంను మీసేవలో సబ్‌మిట్ చేయండి.
అప్పుడు మీ సేవ వారు మీకు అక్నాలెడ్జ్ స్లిప్ ఇస్తారు.
దాన్ని జాగ్రత్తగా భద్రపరచండి

మొబైల్‌ నెంబర్‌కు రేషన్‌కార్డు మంజూరైనట్లు సందేశం వస్తుంది. ఆ వెంటనే మీరు అప్లై చేసిన మీ సేవ కేంద్రానికి వెళ్లి  అక్నాలెడ్జ్ స్లిప్ చూపిస్తే మంజూరైన రేషన్ కార్డును డౌన్‌లోడ్‌ చేసి ఇస్తారు.

Also Read:

Voter Id Card Corrections: మీ ఓటర్ కార్డులో పేరు, అడ్రస్ తప్పుగా ఉన్నాయా ? అయితే సులభంగా మార్చేసుకోండిలా..