AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏందీ.. ఎలుకల్లో ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయా? ఆ విషయంలో మనుషుల కంటే బెటరంటా..!

ఎలుకలు అంటే కేవలం నష్టం చేసే జీవులేనని చాలామంది భావిస్తారు. కానీ వాటిలో తెలివితేటలు, సహకార భావన, జ్ఞాపకశక్తి, పరిశుభ్రత, పరిస్థితులకు అనుగుణంగా మారే సామర్థ్యం వంటి ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి. వాటి గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి.

ఏందీ.. ఎలుకల్లో ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయా? ఆ విషయంలో మనుషుల కంటే బెటరంటా..!
Rats
SN Pasha
|

Updated on: Jul 03, 2026 | 4:28 PM

Share

ఇంట్లో ఎలుక కనిపిస్తే చాలామంది వెంటనే దానిని తరిమేయాలని లేదా చంపేయాలని ప్రయత్నిస్తారు. పంటలకు, ఆహార పదార్థాలకు నష్టం కలిగించే జీవిగా ఎలుకలకు చెడ్డ పేరు ఉన్నప్పటికీ, వాటిలో కొన్ని ఆశ్చర్యకరమైన మంచి లక్షణాలు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తెలివితేటలు, పరిస్థితులకు అనుగుణంగా మారే సామర్థ్యం, సామాజిక ప్రవర్తన వంటి అంశాల్లో ఎలుకలు ఇతర చిన్న జంతువులతో పోలిస్తే ప్రత్యేకతను కనబరుస్తాయి. మరీ ముఖ్యంగా అవి చాలా శుభ్రంగా ఉంటాయంటా.

పరిశోధనల ప్రకారం ఎలుకలు అత్యంత తెలివైన జీవుల్లో ఒకటి. ఒకసారి నేర్చుకున్న దారిని లేదా ప్రమాదకరమైన ప్రదేశాన్ని అవి చాలా కాలం వరకు గుర్తుంచుకుంటాయి. ఆహారం దొరికే ప్రదేశాలను సులభంగా గుర్తించి, మళ్లీ అక్కడికే చేరుకునే జ్ఞాపకశక్తి వాటికి ఉంటుంది. అందుకే శాస్త్రీయ పరిశోధనల్లో కూడా ఎలుకలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సహకార భావన కూడా ఎలుకల ప్రత్యేక లక్షణాల్లో ఒకటి. ఒక ఎలుక ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు లేదా బోనులో ఇరుక్కుపోయినప్పుడు, మరో ఎలుక దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించిన సందర్భాలు పరిశోధనల్లో నమోదయ్యాయి. తమ గుంపులోని సభ్యులకు ప్రమాద సంకేతాలను కూడా అవి తెలియజేస్తాయి. దీంతో మిగిలిన ఎలుకలు అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు వెళ్లగలుగుతాయి.

ఇది కూడా చదవండి: Video: తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు

పరిస్థితులకు అనుగుణంగా మారడంలో కూడా ఎలుకలు ముందుంటాయి. నగరాలు, గ్రామాలు, అడవులు, వ్యవసాయ పొలాలు వంటి విభిన్న వాతావరణాల్లో సులభంగా జీవించగల సామర్థ్యం వాటికి ఉంది. ఆహారం కొరత ఉన్న సమయంలో కూడా ప్రత్యామ్నాయ మార్గాలను వెతికి జీవనం కొనసాగించడం వాటి ప్రత్యేకత. ఎలుకలు చాలా శుభ్రతను కూడా పాటిస్తాయి. రోజులో అనేకసార్లు తమ శరీరాన్ని శుభ్రం చేసుకుంటూ బొచ్చును పరిశుభ్రంగా ఉంచుకుంటాయి. ఈ అలవాటు వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు పరాన్నజీవుల నుంచి కూడా కొంత రక్షణ లభిస్తుంది.

అలాగే ఎలుకలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాయి. కొత్త ఆహారం లేదా కొత్త ప్రదేశాన్ని వెంటనే స్వీకరించకుండా ముందుగా పరిశీలిస్తాయి. ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ముందుకు సాగుతాయి. ఈ జాగ్రత్త స్వభావం వల్ల అనేక ప్రమాదాల నుంచి తప్పించుకోగలుగుతాయి. అయితే ఎలుకల్లో మంచి లక్షణాలు ఉన్నప్పటికీ అవి ఇళ్లలో లేదా వ్యవసాయ భూముల్లో అధికంగా పెరిగితే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు కలిగించే అవకాశం ఉంటుంది. అయితే శుభ్రత విషయంలో ఎలుకలు అనే జీవుల కంటే, ఇన్‌ఫ్యాక్ట్ మనుషుల కంటే కూడా ముందున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.

Follow Us
ఏందీ.. ఎలుకల్లో ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయా?
ఏందీ.. ఎలుకల్లో ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయా?
మన తాతల సీక్రెట్ ఈ పొలం పచ్చడే.. ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్!
మన తాతల సీక్రెట్ ఈ పొలం పచ్చడే.. ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్!
ఒక్కో పరుగుకు రూ. 14 వేలు.. దటీజ్ బుడ్డోడి బ్రాండ్ వాల్యూ
ఒక్కో పరుగుకు రూ. 14 వేలు.. దటీజ్ బుడ్డోడి బ్రాండ్ వాల్యూ
బాలీవుడ్ ఫిట్‌నెస్ క్వీన్ మలైకా డైట్ ప్లాన్, ఫిట్‌నెస్ సీక్రెట్
బాలీవుడ్ ఫిట్‌నెస్ క్వీన్ మలైకా డైట్ ప్లాన్, ఫిట్‌నెస్ సీక్రెట్
'NEET UG 2026 రీఎగ్జాం ఫలితాల తేదీ ఇదే.. MBBS తరగతులు ఆలస్యంకావు'
'NEET UG 2026 రీఎగ్జాం ఫలితాల తేదీ ఇదే.. MBBS తరగతులు ఆలస్యంకావు'
తెలంగాణలో రాబోయే 3 రోజులకు లేటెస్ట్ రిపోర్ట్ ఇదే
తెలంగాణలో రాబోయే 3 రోజులకు లేటెస్ట్ రిపోర్ట్ ఇదే
ఒక్క దెబ్బకు వీరి అప్పులు మొత్తం ఎగిరిపోతాయి.. మీ రాశి ఉందా?
ఒక్క దెబ్బకు వీరి అప్పులు మొత్తం ఎగిరిపోతాయి.. మీ రాశి ఉందా?
అమర పావురాల రహస్యం నుంచి మంచు శివలింగం వరకు.. బాబా బర్ఫానీ మహిమలు
అమర పావురాల రహస్యం నుంచి మంచు శివలింగం వరకు.. బాబా బర్ఫానీ మహిమలు
ప్రభుత్వ బ్యాంకుల్లో భారీగా కొలువులు.. డిగ్రీ అర్హతతో IBPS జాబ్స్
ప్రభుత్వ బ్యాంకుల్లో భారీగా కొలువులు.. డిగ్రీ అర్హతతో IBPS జాబ్స్
ఆకుకూరలు తినని వారికి బెస్ట్.. తోటకూర వేపుడు ఇలా చేస్తే వదలరు
ఆకుకూరలు తినని వారికి బెస్ట్.. తోటకూర వేపుడు ఇలా చేస్తే వదలరు