AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు

రీల్స్ పిచ్చిలో పడి యువత ప్రాణాలు లెక్కచేయకుండా ప్రమాదకర పనులు చేస్తున్నారు. తాజాగా, ఓ యువకుడు విష సర్పంతో రీల్ తీసే ప్రయత్నంలో పాము కాటుకు గురయ్యాడు. ఇలాంటి మతిలేని సాహసాలు ప్రాణాలను తీయగలవు. సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే తపనలో భద్రతను విస్మరించడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని ఈ ఘటన స్పష్టం చేస్తుంది.

Video: తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
Viral Snake Video
SN Pasha
|

Updated on: Jul 01, 2026 | 6:36 PM

Share

చాలా మంది రీల్స్ పిచ్చిలో పడి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. ఒకడు రైలుకు ఎదురెళ్తున్నాడు, ఇంకొకడు కొండ మీద నుంచి దూకేస్తున్నాడు, మరొకడు ర్యాష్ డ్రైవింగ్‌తో రోత పుట్టిస్తున్నాడు. ఈ రీల్స్ పిచ్చితో ప్రాణాలంటే లెక్కలేకుండా ఉన్నారు. తాజాగా ఓ యువకుడు కూడా అలాంటి మతిలేని పనితో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఒక పెద్ద దాదాపు పది అడుగులు ఉన్న విషపూరిత పామును పట్టుకొని గాల్లోకి లేపుతూ రీల్ షూట్ చేసేందుకు రెడీ అయ్యాడు.

మీరు కూడా ఆ వీడియో చూసేయండి..

అనుకున్నట్లే పెద్ద పామును పట్టుకొని గాల్లోకి లేపుతూ మరో వైపు ఫొటో పెట్టుకున్నాడు. కానీ విషజీవి ఊరుకుంటుందా? వీడు నన్నేదో చేసేలా ఉన్నాడని భయపడిందో ఏమో కానీ దాని సహజ గుణం చూపించింది. తనను పట్టుకున్న ఆ యువకుడి చెంపపై కస్సు కాటేసింది. అంతే.. దెబ్బకు షాక్ తిన్న యువకుడు ఆ పామును విసిరేస్తూ ప్రాణభయంతో పరిగెత్తాడు. అయితే పాముతో రీల్ చేసి వైరల్ అవుదాం అనుకున్నవాడు.. ప్రాణాలు కాపాడుకునేందుకు ఆస్పత్రికి పరుగులు తీశాడు. ప్రస్తుతం పాము కాటేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో chitransh_bhai_2.0 అనే ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ అయి ఉంది. ఆ అకౌంట్ చెక్ చేయగా.. అతను పాములు, ఇతర బల్లి జాతి జంతువులను పట్టుకుంటూ వాటితో రీల్స్ తీసుకుంటూ ఉంటాడనే విషయం తెలుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సెప్టెంబర్ 7 రాశిఫలాలు: వీరికి ఈ రోజు పట్టిందల్లా బంగారమే..
సెప్టెంబర్ 7 రాశిఫలాలు: వీరికి ఈ రోజు పట్టిందల్లా బంగారమే..
బంగారం, వెండి కొనేవారికి శుభవార్త.. మళ్లీ తగ్గుతున్న ధరలు
బంగారం, వెండి కొనేవారికి శుభవార్త.. మళ్లీ తగ్గుతున్న ధరలు
దారుణ హత్య.. మహిళ గొంతులో కత్తెరలు దింపి మర్డర్‌! ఎక్కడంటే..
దారుణ హత్య.. మహిళ గొంతులో కత్తెరలు దింపి మర్డర్‌! ఎక్కడంటే..
మహిళ కడుపులో 14 పెన్నులు, 5 చెంచాలు.. డాక్టర్లు ఏం చేశారంటే?
మహిళ కడుపులో 14 పెన్నులు, 5 చెంచాలు.. డాక్టర్లు ఏం చేశారంటే?
ఇక వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు.. కష్టాలకు ఫుల్ స్టాప్
ఇక వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు.. కష్టాలకు ఫుల్ స్టాప్
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..