Octopus: అక్టోపస్‌ జీవి గురించి మీకు తెలుసా..? ఆశ్చర్యపోయే నిజాలు!

Octopus: ఆక్టోపస్‌లు సైన్స్ ఫిక్షన్ జీవులతో పోటీ పడగలవు. పెద్ద కళ్ళు, బహుళ చేతులు, మృదువైన శరీరం, ఆకారాన్ని మార్చే, విషపూరితమైనవి. అలాగే అద్భుతమైన తెలివితేటలు కలిగి ఉంటాయి. ఆక్టోపస్‌ల గురించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే చేపల గురించి కాకుండా సముద్ర జీవుల గురించి మాట్లాడినప్పుడల్లా ఆక్టోపస్ గురించి ఖచ్చితంగా చెప్పుకుంటారు..

Octopus: అక్టోపస్‌ జీవి గురించి మీకు తెలుసా..? ఆశ్చర్యపోయే నిజాలు!
Octopus

Updated on: Jan 14, 2026 | 7:50 AM

Octopus: చేపల గురించి కాకుండా సముద్ర జీవుల గురించి మాట్లాడినప్పుడల్లా ఆక్టోపస్ గురించి ఖచ్చితంగా చెప్పుకుంటారు. ఆ ఫోటోలోని ఆక్టోపస్‌ని మీరు కూడా చూసి ఉంటారు. రూపానికి వింతగా కనిపించే ఈ జీవి ప్రత్యేకంగా ఉంటుంది. ఈ జీవిలో ప్రత్యేక లక్షణాలు కూడా చాలా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. ఈ జీవి గురించి ఎన్ని వింతలు ఉన్నాయో తెలుసుకుందాం.

ఈ జీవిలో మీరు చూసే చేతులు దాని కాళ్ళు కావు. చాలా మంది దాని కాళ్ళు అని అనుకుంటారు. అలాగే ఇది ప్రతి చేతిలో మెదడును కలిగి ఉంటుంది. ఈ జీవికి 9 మెదడులను కలిగి ఉంటుంది. ఇది ఒక ప్రధాన మెదడు, ఎనిమిది చేతుల్లో మరో ఎనిమిది మెదడులను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఆక్టోపస్ శ్వాసను నియంత్రించడానికి మూడు హృదయాలను కలిగి ఉంటుంది. దీనితో పాటు దాని రక్తం కూడా నీలం రంగులో ఉంటుంది. అందుకే ఈ జీవి ఇతర జీవుల కంటే చాలా భిన్నంగా ఉంటుంది.

దీనికున్న చేతులు ఈ జీవికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఏ జీవి నుండి అయినా రక్షించడానికి ప్రతి వైపు ఒక కన్నేసి ఉంచుతుంది. ఆక్టోపస్ తన మనసుకు అనుగుణంగా పర్యావరణాన్ని పొందకపోతే అది విసుగు చెందుతుందట. ఆపై తన చేతులను తానే కొరుకుకోవడం ప్రారంభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎక్కువగా సముద్రంలో నివసిస్తుంది. ఆక్టోపస్ జీవిత కాలం పెద్దగా ఉండదు. దానికి సంబంధించిన జాతులు చాలా వరకు 6 నెలల్లో చనిపోతాయి. అంటే వాటి జీవితకాలం 6 నెలలు.

ప్రధానంగా పీతలు, చిన్న చేపలు, షెల్‌ఫిష్‌లు తింటాయి. ముక్కుతో ఆహారాన్ని తింటాయి. అక్టోపస్‌లు చాలా తెలివైన జీవులు. సమస్యలు పరిష్కరించడం, పరికరాలు ఉపయోగించడం వంటి సామర్థ్యాలు ఉన్నాయి. మాయాజాలంలా తప్పించుకునే నైపుణ్యం ఉంటుంది. అక్టోపస్‌లు చాలా తెలివైన జీవులు. సమస్యలు పరిష్కరించడం, పరికరాలు ఉపయోగించడం వంటి సామర్థ్యాలు ఉన్నాయి. మాయాజాలంలా తప్పించుకునే నైపుణ్యం ఉంటుంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి