తలస్నానం చేసినప్పుడు ఈ తప్పు అస్సలు చేయకండి..! ఇదే మీ బట్టతలకు మెయిన్‌ రీజన్..!!

జుట్టు సంరక్షణ విషయంలో మనం షాంపూలు, ఆయిల్స్ మీద పెట్టే శ్రద్ధ, జుట్టును ఆరబెట్టుకునే పద్ధతిపై పెట్టం. తలస్నానం చేశాక టవల్‌ను తలకు టర్బన్ లాగా గట్టిగా చుట్టడం ఒక సాధారణ అలవాటు. కానీ, ఈ చిన్న పొరపాటే మీ జుట్టును శాశ్వతంగా దూరం చేస్తుందని మీకు తెలుసా..? తలస్నానం చేసిన తర్వాత జుట్టును గట్టిగా టవల్‌తో చుట్టే అలవాటు మీకూ ఉందా.. అయితే, ఈ వార్త మీ కోసమే..

తలస్నానం చేసినప్పుడు ఈ తప్పు అస్సలు చేయకండి..! ఇదే మీ బట్టతలకు మెయిన్‌ రీజన్..!!
Wet Hair Care

Updated on: Apr 17, 2026 | 7:47 AM

చాలామంది తలస్నానం చేసిన వెంటనే జుట్టు ఆరాలని మందపాటి టవల్‌తో గట్టిగా చుట్టేస్తుంటారు. కానీ, ఇది చాలా డేంజర్‌ అంటున్నారు కేశ సౌందర్య నిపుణులు. ఈ అలవాటు మీ జుట్టును దెబ్బతీస్తుందని అంటున్నారు. ఎందుకంటే తడి జుట్టు చాలా బలహీనంగా ఉంటుందని, ఈ సమయంలో టవల్ వల్ల కలిగే ఘర్షణ (Friction), బరువు కారణంగా జుట్టు వేర్ల నుండి ఊడిపోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జుట్టును మందపాటి టవల్‌లో చుట్టడం వల్ల నుదుటి మీద జుట్టు పలుచబడి, ముందు వైపు జుట్టు పల్చగా కనిపిస్తుంది.

జుట్టు తడిగా ఉన్నప్పుడు దాని రంధ్రాలు (Follicles) తెరుచుకుని ఉంటాయి. ఈ సమయంలో జుట్టు చాలా సున్నితంగా ఉంటుంది. మందపాటి, బరువైన టవల్‌ను చుట్టడం వల్ల ఆ బరువుకు జుట్టు వేర్ల నుండి లాగబడినట్లు అవుతుంది. దీనివల్ల జుట్టు విపరీతంగా రాలుతుంది. జుట్టును గట్టిగా చుట్టడం వల్ల కలిగే ఒత్తిడి కారణంగా ట్రాక్షన్ అలోపేసియా అనే సమస్య వస్తుంది. అంటే జుట్టు వరుసగా ఊడిపోతూ బట్టతలకు దారితీస్తుంది. మందపాటి టవల్‌తో గట్టిగా రుద్దడం వల్ల జుట్టు పైన ఉండే సహజమైన పొర (Cuticle) దెబ్బతింటుంది. దీనివల్ల జుట్టు జిగటగా మారిపోయి, చివర్లు చిట్లిపోతాయి (Split Ends).

మరి తడి జుట్టును ఆరబెట్టుకోవడానికి సరైన పద్ధతి ఏమిటి..? అనే సందేహం మీకు కలిగే ఉంటుంది..దీనికోసం కాటన్ టీ-షర్ట్ లేదా మెత్తని వస్త్రం బెటర్‌. జుట్టు ఆరబెట్టుకోవడానికి మందపాటి టవల్ కంటే పాత కాటన్ టీ-షర్ట్ లేదా మైక్రోఫైబర్ టవల్ వాడటం ఉత్తమం అంటున్నారు నిపుణులు. ఇవి నీటిని త్వరగా పీల్చుకుంటాయి. జుట్టుపై ఒత్తిడి కలిగించవు.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, జుట్టును టవల్‌తో కొట్టడం లేదా రుద్దడం చేయకూడదు. కేవలం సున్నితంగా అద్ది నీటిని తీసేయాలి. సహజంగా ఆరనివ్వండి: వీలైనంత వరకు జుట్టును ఫ్యాన్ కింద లేదా గది ఉష్ణోగ్రత వద్ద గాలికి ఆరనివ్వాలి. హెయిర్ డ్రైయర్ల వాడకాన్ని తగ్గించాలి. జుట్టు పూర్తిగా ఆరిన తర్వాతే వెడల్పాటి పళ్లున్న దువ్వెనతో దూవాలి. మీ జుట్టు అందంగా, ఒత్తుగా ఉండాలంటే తలస్నానం తర్వాత చేసే ఈ చిన్న తప్పును వెంటనే మానుకోండి. సున్నితమైన సంరక్షణే మీ జుట్టుకు అసలైన బలాన్నిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us