Sonu Sood : ‘నేను కాదు.. సోనూసూద్ సూపర్ హీరో’.. అతనికి థ్యాంక్స్ చెప్పమన్న కేటీఆర్.. ట్విట్టర్ వేదికగా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ

|

Jun 01, 2021 | 11:58 AM

ట్విట్టర్ వేదికగా సోనూ సూద్ ఇచ్చిన మెసేజ్ కు రిప్లై ఇచ్చిన కేటీఆర్.. 'చాలా ధన్యవాదాలు బ్రదర్.. లక్షలాది మందికి స్పూర్తినిస్తూ మీరు ప్రారంభించిన గొప్ప పనిని కొనసాగించండి..

Sonu Sood : నేను కాదు..  సోనూసూద్ సూపర్ హీరో.. అతనికి థ్యాంక్స్ చెప్పమన్న కేటీఆర్.. ట్విట్టర్ వేదికగా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ
Ktr Sonu Sood
Follow us on

KTR and Sonu Sood superhero conversation : తెలంగాణ మంత్రి కేటీఆర్ – ప్రముఖ సినీ నటుడు, కరోనా కష్టకాలంలో ఎందరికో ఆపన్నహస్తం అందిస్తోన్న సోనూసూద్ మధ్య తాజాగా ఆసక్తికర సంభాషణ జరిగింది. ట్విట్టర్ వేదికగా సోనూ సూద్ ఇచ్చిన మెసేజ్ కు రిప్లై ఇచ్చిన కేటీఆర్.. ‘చాలా ధన్యవాదాలు బ్రదర్.. లక్షలాది మందికి స్పూర్తినిస్తూ మీరు ప్రారంభించిన గొప్ప పనిని కొనసాగించండి’. అంటూ కేటీఆర్ అన్నారు. ఇంతకీ వీరి సంభాషణ నేపథ్యం ఏంటంటే.. తెలంగాణకు చెందిన ఒక కరోనా రోగి ట్విట్టర్లో కేటీఆర్ కు కృతజ్ఞత చెప్పారు. కేవలం పది గంటల్లోనే తాము కోరిన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్‌ను అందించినందుకు ధన్యవాదాలు కేటీఆర్ సార్. కరోనా కష్టకాలంలో ఇప్పటి వరకూ మీరెంతోమంది తెలంగాణ ప్రజలకి సాయం చేశారు. మీరందించిన సహాయాన్ని మేము ఎప్పటికీ మరచిపోలేము. అంటూ అతను కేటీఆర్ కు మెసేజ్ పెట్టగా.. కేటీఆర్ దీనిపై స్పందించారు. ” బ్రదర్.. నేను మీచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధిని. నావంతు బాధ్యత మాత్రమే చేస్తున్నా.. మీరు చెప్పిన సూపర్ హీరో కచ్చితంగా సోనుసూద్. అతనికి కృతజ్ఞతలు చెప్పండి అంటూ కేటీఆర్.. సోనూసూద్ ని ట్యాగ్ చేస్తూ రిప్లై ఇచ్చారు. దీంతో.. కేటీఆర్ ట్వీట్ కు సోనూ సూద్ స్పందించారు.

‘మీ ప్రేమ పూరిత మాటలకు చాలా ధన్యవాదాలు సార్! కానీ మీరు నిజంగా తెలంగాణ కోసం ఎంతో చేసిన హీరో. మీ నాయకత్వంలో రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది. నేను తెలంగాణను నా రెండో ఇంటిగా.. నా వర్క్ స్టేషన్ గా భావిస్తున్నాను. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు నాపై చాలా ప్రేమను చూపించారు. అంటూ సోనూసూద్.. కేటీఆర్ కు మరో రిప్లై ఇచ్చారు.

Read also : White fungus : ఆంధ్రప్రదేశ్‌లో వైట్ ఫంగస్ కలకలం.. కర్నూలు జిల్లా వెలుగోడు మండలంలో వ్యాధి నిర్ధారణ