
బంగారం ధర పెరగడంతో చాలా మంది వెండి ఆభరణాలు కొనడం ప్రారంభించారు. దీంతో వెండికి డిమాండ్ పెరిగిపోయింది. దీన్ని అదునుగా చేసుకున్న కొందరు వ్యాపారులు నకిలీ వెండి ఆబరణాలను కూడా మార్కలెట్‌లోకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మార్కెట్‌లోకి వచ్చది, మీ దగ్గర ఉన్న వెండి ఆభరణాలు అసలైనవో కాదో ఎలా కనుక్కోవాలో మీకు తెలుసా.. తెలియక పోయినా మీరు ఎలాంటి దిగులు చెందాల్సిన అవసం లేదు.. ఎందుకంటే ఇప్పుడు నకిలీ వెండిని ఎలా గుర్తించాలో ఇక్కడ తెలుసుకుందాం.
నిజమైన వెండి ఆభరణాలకు దాని స్వచ్ఛతను సూచించే హాల్‌మార్క్ ఉంటుంది. ఇది 925 లేదా 92.5 ఉంటుంది. ఇవి లేని ఏ నగలైనా మిశ్రమంతో తయారు చేసిందని అర్థం. దీనిని స్టెర్లింగ్ అంటారు. దీనికి 999 హాల్‌మార్క్ ఉంటే, అది 99.9 శాతం స్వచ్ఛమైన వెండి అని మీరు ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఐస్ క్యూబ్ పరీక్ష
వెండి వేడిని త్వరగా గ్రహిస్తుంది. కాబట్టి స్వచ్ఛతను పరీక్షించడానికి, వెండి ఆభరణాలపై ఐస్ క్యూబ్ ఉంచండి. అది త్వరగా కరిగిపోతే, అది స్వచ్ఛమైన వెండి అని మీరు నిర్ధారించుకోవచ్చు.
అయస్కాంత పరీక్ష : అయస్కాంత పరీక్ష ద్వారా కూడా వెండి నిజమైనదా, కాదా అని గుర్తించవచ్చు. నిజమైన వెండి ఎప్పుడూ అయస్కాంతానికి అంటుకోదు. మీరు దానిని అయస్కాంతంతో పరీక్షించవచ్చు. దానిని ఇతర లోహాలతో కలిపితే, అది ఖచ్చితంగా అయస్కాంతానికి అంటుకుంటుంది.
వస్త్రంతో పరీక్ష: తెల్లటి వస్త్రాన్ని తీసుకొని వెండిని తుడవండి. అది నిజమైన వెండి అయితే, వస్త్రం నలుపు లేదా బూడిద రంగులోకి మారుతుంది.
ధ్వని తనిఖీ: నిజమైన వెండిని మరొక వస్తువుపై సున్నితంగా కొట్టినప్పుడు రింగింగ్ శబ్దం చేస్తుంది. ఇలా వస్తే అది నిజమైన వెండి అని అర్థం
బరువు: నిజమైన వెండి ఇతర లోహాల కంటే బరువైనదిగా ఉంటుంది. మీ బ్రాస్‌లెట్‌లోని వెండి బరువైనట్లు అనిపిస్తే, అది నిజమైనదే.
రసాయన పరీక్ష: వెండి స్వచ్ఛతను తనిఖీ చేయడానికి మార్కెట్లో రసాయన పరీక్షా కిట్లు అందుబాటులో ఉన్నాయి. మీరు వాటిని ఉపయోగించి కూడా వెండి స్వచ్ఛతను తనిఖీ చేయవచ్చు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.