వరి పొట్టుతో వ్యాపారం.. ప్రతి ఏటా లక్షల్లో సంపాదన.. అదిరిపోయిన బిజినెస్ ఐడియా..

|

Feb 06, 2021 | 6:38 PM

కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో చాలా మంది వ్యాపారం వైపు అడుగులు వేస్తున్నారు. కానీ ఏ వ్యాపారం చేయాలి ? ఎలాంటి వ్యాపారం చేస్తే రిస్క్ లేకుండా డబ్బు సంపాదించవచ్చు

వరి పొట్టుతో వ్యాపారం.. ప్రతి ఏటా లక్షల్లో సంపాదన.. అదిరిపోయిన బిజినెస్ ఐడియా..
Follow us on

కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో చాలా మంది వ్యాపారం వైపు అడుగులు వేస్తున్నారు. కానీ ఏ వ్యాపారం చేయాలి ? ఎలాంటి వ్యాపారం చేస్తే రిస్క్ లేకుండా డబ్బు సంపాదించవచ్చు అనే ఆలోచనలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. అయితే ఓ వ్యక్తి సరికొత్తగా ట్రై చేశాడు. దీంతో సంవత్సరానికి లక్షలకు సంపాదిస్తున్నాడు. మరీ అతడు చేసే బిజినెస్ ఏంటో తెలుసుకుందామా.

ఒడిశాలోని కలహందిలో బిభు సాహు అనే టీచర్ ఉన్నారు. 2007లో ఆయన ఆ ఉద్యోగాన్ని మానేశారు. ఆ తర్వాత అగ్రి బిజినెస్‏లోకి అడుగులు వేశారు. దీంతో మెల్లగా రైస్ మిల్లు వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చారు. రైస్ మిల్లు వ్యాపారంతో ప్రతి సంవత్సరం దాదాపు 3 టన్నుల వరకు వరి పొట్టు వచ్చేది. దానిని ఏం చేయాలో తెలియాక బీబీ సాహు ఊరి బయట ఆ వరిపొట్టును కాల్చివేసేవారు. దీంతో వాతావారణ కాలుష్యం ఏర్పడుతుందంటూ చుట్టుపక్కల వారు వచ్చి ఫిర్యాదు చేసేవారు. మళ్లీ ఆ వరిపొట్టును ఏం చేయాలో తెలియక ఒక వేర్ హౌస్‏లో ఆ పొట్టును దాచేవారు. క్రమంగా అది కూడా నిండిపోయింది. ఈ పరిస్థితితో దాన్ని ఏం చేయాలా అని సాహు రీసెర్చ్ చేశాడు. ఆ వరిపొట్టును స్టీల్ పరిశ్రమలో థర్మల్ ఇన్సులేటర్‏గా వాడొచ్చు అనే ఆలోచన తట్టింది. కానీ దానిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలో సాహుకు అర్థం కాలేదు. ఇదే విషయమై సాహు చాలా మంది నిపుణులను కలిసిన ప్రయోజనం లేకపోయింది.

ఒక రోజు సాహు స్నేహితుడు కొంత సమయం కావాలని అడిగి ఊరెళ్లి తనతోపాటు మరో నలుగురు వ్యక్తులను తీసుకువచ్చాడు. వీరందరూ కలిసి ఆ వరి పొట్టును చిన్న చిన్న గుండ్లు, గుళికల మాదిరిగా తయారు చేశారు. వాటి గురించి సాహు విదేశాల్లోని కంపెనీలకు మెయిల్స్ చేశాడు. 2019లో తొలి లోడును సౌదీ అరేబియాకు పంపాడు. ఇక అదే సంవత్సరం 100 టన్నుల గుళికలకు ఏకంగా రూ.20 లక్షలు సంపాదించాడు. వరి పొట్టుతో కూడా ప్రతి ఏటా లక్షలు ఆర్జిస్తున్నాడు సాహు.

Also Read:

వాహనాదారులరా అలర్ట్.. ఇకపై ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే అంతే సంగతులు.. ఏ ఏ తప్పుకు ఎంత కట్టాలో తెలుసా ?