Droupadi Murmu news: శనివారం రామ్‌నాథ్ కోవింద్(ramnath kovind) రిటైర్ అవుతున్నారు. ఆదివారం రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దేశంలోనే అత్యున్నత పదవి స్వీకరించబోతున్న తొలి ఆదివాసీ గిరిజన మహిళ ముర్ము. ఈ క్రమంలోనే ప్రెసిడెంట్‌కు ఎంత శాలరీ ఉంటుంది.. ఎలాంటి సౌకర్యాలు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. పెన్షన్‌తో పాటు ఇతర సౌకర్యాలు ఎలా ఉంటాయన్న చర్చ నడుస్తోంది. ఆ వివరాలు మీకు అందించబోతున్నాం. రాష్ట్రపతికి ప్రతి నెల 5లక్షల రూపాయల జీతం వస్తుంది. వసతి, వైద్య, ప్రయాణ సదుపాయాలు ఫ్రీ. భారత రాష్ట్రపతితో పాటు అతని/ఆమె జీవిత భాగస్వామి ప్రపంచంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. దేశంలో అత్యధిక వేతనం రాష్ట్రపతికే ఉంటుంది. 2017 వరకు ఈ మొత్తం లక్షన్నర మాత్రమే ఉండేది. 2018లో 5 లక్షల రూపాయలకు పెంచారు. జీతం కాక అలవెన్సులు కూడా ఉంటాయి. న్యూఢిల్లీలోని 340 గదులు, హాళ్లు, తోటలు, ఉన్న రాష్ట్రపతి భవన్ అధికారిక నివాసం. అందులోనే బసచేస్తారు. రాష్ట్రపతి సాధారణంగా ప్రీమియం వాహనాల్లో తిరుగుతారు. ప్రధానంగా కస్టమ్-బిల్ట్ హెవీ ఆర్మర్డ్ మెర్సిడెస్ బెంజ్ S600 (W221)లో ప్రయాణిస్తారు. కార్లలో అత్యాధునిక భద్రతా వ్యవస్థలు కూడా ఉన్నాయి. ప్రెసిడెంట్ వాడే కారు బుల్లెట్లు, బాంబులు, గ్యాస్ దాడులు, ఇతర పేలుడు పదార్థాలను తట్టుకోగలదు. భారత ఆర్మీ విభాగంలోని అత్యున్నత విభాగం ప్రెసిడెంట్స్ బాడీగార్డ్ (President’s Bodyguard) రాష్ట్రపతికి రక్షణ కల్పిస్తారు. ఈ విభాగంలో ఆర్మీ, వాయు సేన, నావీ దశాలకు చెందిన అగ్రశ్రేణి సైనికులు ఉంటారు. రాష్ట్రపతికి రెండు విడిదిలు ఉన్నాయి. సమ్మర్ విడిది సిమ్లాలో ఉంటే, శీతాకాలం విడిది మన భాగ్యనగరంలో ఉంది.
రాష్ట్రపతి పదవి నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత .. నెలకు లక్షన్నర పెన్షన్ వస్తుంది. వారి భాగస్వామికి కూడా 30 వేలు పెన్షన్ వస్తుంది. ఢిల్లీ పోలీసుల భద్రత కల్పిస్తారు. ఉచిత నివాసం, అయిదుగురు సిబ్బంది, ఫోన్, ఉచిత ప్రయాణ సదుపాయాలు ఉంటాయి.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి