Friendship Video: స్నేహమంటే ఇదేరా.. ఫుడ్ డెలివరీ బాయ్ చేసిన పనికి నెటిజన్లు సలామ్..
ఒకరి కష్టాన్ని అర్థం చేసుకుని వారికి సహాయం చేయడంలో ఉండే ఆనందమే వేరు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఫుడ్ డెలివరీ బాయ్స్‌కి సంబంధించినది.
ఒకరి కష్టాన్ని అర్థం చేసుకుని వారికి సహాయం చేయడంలో ఉండే ఆనందమే వేరు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఫుడ్ డెలివరీ బాయ్స్‌కి సంబంధించినది. ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసిననప్పుడు ఫుడ్ డెలివరీ మ్యాన్ గడువులోపు పెట్టిన ఆర్డర్ డెలివరీ చేస్తారని మన అందరికీ తెలుసు. అయితే, కొన్నిసార్లు కొంతమంది డెలివరీ బాయ్స్ సైకిళ్ల వంటి వాహనాలను ఉపయోగిస్తుంటారు. దీనివల్ల ఫుడ్ డెలివరీ టైమ్‌లో కాస్త వెనుకాముందు అవుతుంటుంది. అలా జరగకుండా ఉండేందుకు సైకిల్‌పై వెళ్తున్న ఓ కంపెనీకి చెందిన ఫుడ్ డెలివరీ మ్యాన్‌కి.. బైక్‌పై వెళ్తున్న మరో కంపెనీకి చెందిన డెలివరీ బాయ్ చేసిన సాయం నెట్టింట వైరల్ అవుతోంది. ఓ కారు డ్రైవర్ తన మొబైల్ ఫోన్‌తో ఈ స్నేహ పూర్వక దృశ్యాన్ని చిత్రీకరించారు.వైరల్ అవుతున్న ఈ వీడియోలో సైకిల్‌పై ఓ ఫుడ్ డెలివరీ మ్యాన్ చేయి పట్టుకుని బైక్‌పై మరో ఫుడ్ డెలివరీ బాయ్ వెళ్తున్నాడు. ప్రత్యర్థి కంపెనీ అయినప్పటికీ అతనికి సహాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకున్నాడు. సన్నా అరోరా జూలై 9న తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పంచుకున్నారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. ఈ వీడియోను లక్షలమంది వీక్షిస్తూ వీరి స్నేహాన్ని ప్రశంసిస్తూ లైక్‌లు కామెంట్లతో హోరెత్తించారు. ఒక వినియోగదారు “నేటి ప్రపంచంలో మనకు ఇది అవసరం” అని చెప్పగా, మరొకరు “సామాన్యుడి రోజువారీ జీవన పోరాటం” అంటూ కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్‌గా మారిన భార్య
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్
పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి
మహిళా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్.. ఆరుగురు అరెస్ట్

