
మూషికం… ఆ లంబోధరుడి వాహనం.. వినాయకుడు మనం కోరిన కోర్కెలు తీర్చే అందరి ఇష్టదైవం. అయితే, ఆయన వాహనమైన ఎలుక ఇంట్లో ఎలుకలు ఉండటం సాధారణ విషయమే. కొందరు దీనిని శుభ సంకేతంగా కూడా భావిస్తారు. కానీ, వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కనిపించే ఎలుకలు అనేక విషయాలకు సంబంధించిన సంకేతాలను ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎలుకలు పెద్ద సంఖ్యలో ఉండటం వల్ల శుభ, అశుభ ఫలితాలు ఉంటాయని కూడా వాస్తు జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఎలుకలు ఎక్కడ కనిపిస్తే అది శుభప్రదమో, అశుభకరమైనదో నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం..
మీ ఇంట్లో పెద్ద సంఖ్యలో ఎలుకలు కనిపించడం అశుభం అంటున్నారు వాస్తు నిపుణులు. ఇది మీ ఇంటికి పేదరికాన్ని తెచ్చిపెడుతుందని అంటున్నారు. అలాగే, రాత్రిపూట ఎలుకలు వచ్చి శబ్దం చేయడం ప్రారంభిస్తే, అది ఏదో అవాంఛనీయ సంఘటన జరుగుతుందనడానికి సంకేతంగా చూడాలని నిపుణులు చెబుతున్నారు.
ఎలుకలు మీ ఇంట్లోకి వచ్చి నిరంతరం వస్తువులను కొరుకుతూ ఉంటే, మీ ఆనందం, శ్రేయస్సు తగ్గుతాయని అర్థం చేసుకోండి. అయితే ఎలుకలు మీ ఇంట్లో రాత్రంతా తిరుగుతుంటే, అది ఏదైనా వ్యాధి రాకకు సంకేతంగా చెబుతున్నారు.
(Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..