Brain Tumor Surgery: క్లిస్టమైన బ్రెయిన్ సర్జరీ చేస్తుంటే.. గాయత్రీ మంత్రం పఠించిన రోగి!

|

Aug 11, 2021 | 12:01 PM

మెలకువగా ఉన్న మహిళకు బ్రెయిన్ సర్జరీని రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన వైద్యులు విజయవంతంగా నిర్వహించి, కణితను తొలగించారు.

Brain Tumor Surgery: క్లిస్టమైన బ్రెయిన్ సర్జరీ చేస్తుంటే.. గాయత్రీ మంత్రం పఠించిన రోగి!
Gayatri Mantra
Follow us on

Man Recites Gayathri Manthra: మెలకువగా ఉన్న మహిళకు బ్రెయిన్ సర్జరీని రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన వైద్యులు విజయవంతంగా నిర్వహించి, కణితను తొలగించారు. శస్త్రచికిత్స ద్వారా మెదడులో కణతిని తొలగిస్తుండగా.. తనకేమీ జరగనట్లు ఆమె గాయత్రీ మంత్రం పారాయణ చేశారు. అంతేకాదు, ఆమె మధ్యలో తప్పు పలికితే ఆపరేషన్‌ చేస్తున్న వైద్యుడొకరు సహకరించడం విశేషం.

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఒక బాధితునికి బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ అత్యంత విచిత్ర పరిస్థితిలో జరిగింది. బాధితుడు స్పృహలో ఉండగానే ఈ ఆపరేషన్ చేయించుకోవడం విశేషం. డాక్టర్ ఆపరేషన్ చేస్తుండగా బాధితుడు గాయత్రీ మంత్ర జపం చేశాడు. ఈ సర్జరీ సుమారు నాలుగు గంటల పాటు జరిగింది. ఈ ఆపరేషన్ కోసం హైఎండ్ మైక్రోస్కోప్ వినియోగించారు. ఇది బ్రెయిన్ ఏరియాను మరింత దగ్గరగా చూసేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇటువంటి ఆపరేషన్లను దేశంలోని ఎంపిక చేసిన కొన్ని కేంద్రాల్లో మాత్రమే చేస్తారు.

పూర్తి వివరాలలోకి వెళ్తే.. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రిడ్మల్ రామ్ కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నారు. దీంతో వైద్యులను సంప్రదించగా, సర్జరీ చేయించుకోవాలని సూచించారు. బాధితుని మెదడులోని కీలకమైన ప్రాంతంలో ట్యూమర్ ఏర్పడిందని దాన్ని వెంటనే తొలగించాలన్నారు. దీంతో బాధితునికి ఆపరేషన్ చేసే సమయంలో చిన్నపాటి పొరపాటు జరిగినా అతను మాట కోల్పోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు గుర్తించారు. ఫలితంగా వైద్యులు… బాధితుడిని స్పృహలో ఉంచుతూనే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో వైద్యులు…బాధితునితో తరచూ చేతివేళ్లను, పాదాలను కొద్దిగా కదిలిస్తూ ఉండాలని చెప్పారు. ఆపరేషన్ నిర్వహించినంత సేపు ప్రత్యేక వైద్యుల బృందం ఆయన్ను కనిపెట్టుకుంటూ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. ఆపరేషన్ సక్సెస్ పట్ల న్యూరో సర్జన్ డాక్టర్ కేకే బన్సాల్ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ ఆపరేషన్ గురించి న్యూరో సర్జన్ డాక్టర్ కేకే బన్సాల్ మాట్లాడుతూ.. సాధారణంగా సర్జరీలు చేసేటప్పుడు బాధితునికి మత్తుముందు ఇస్తామన్నారు. అయితే, ఈ కేసులో బాధితుని స్పృహలో ఉంచే ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. బాధితుడు ఆపరేషన్ చేస్తున్నందసేపూ గాయత్రీ మంత్ర జపం చేస్తూ ఉండమని చెప్పమని తెలిపారు. కాగా, డాక్టర్ బస్సాల్ 2018లోనూ ఇదేవిధంగా అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేశారు.

Read Also…  Medak Murder: మెదక్ కారు దగ్ధం కేసులో ముగ్గురి అరెస్ట్.. పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు