మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమా చూశారా? పక్కా చూసే ఉంటారు. ఈ సినిమాలో కౌగిలింత గురించి చిరంజీవి చెప్పే డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘జంతర్ మంతర్ చూమంతర్ కాళీ, అందర్ దరద్ దెబ్బకు కాలీ’ అని కౌగిలింత గురించి చిరంజీవి చెప్పిన డైలాగ్ ఫుల్ ఫేమస్ అయ్యింది. ఎవరైనా టెన్షన్‌లో, బాధలో ఉన్నప్పుడు ప్రేమగా దగ్గరికి తీసుకుని కౌగిలించుకుంటే ఆ బాధలన్నీ మాయమైపోతాయని అంటారు. అవును, ఇది నిజంగా నిజమే. సైకాలజీ ప్రకారం.. ఇది సాధ్యమే అంటున్నారు నిపుణులు. అయితే, కొందరు వ్యక్తులు దీన్నే తమ ఉపాధిగా మార్చుకుంటున్నారు. కౌగిలింతలతో డబ్బులు సంపాదించేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కౌగిలింతల బిజినెస్ స్టార్ట్ చేశాడో వ్యక్తి. కౌలిగిలింతల ద్వారా గంటకు రూ. 7 వేల వరకు సంపాదిస్తున్నాడు.
కెనడాకు చెందిన ట్రేవర్ హోటన్.. బ్రిటన్‌లో కౌగిలింతల బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఎంబ్రేస్ కనెక్షన్ పేరుతో హగ్ థెరపీ సర్వీస్‌ను ప్రారంభించాడు. ఈ సర్వీస్ ద్వారా ప్రజల మానసిక సమస్యలను పరిష్కరించడంలో హోటన్ బిజీగా ఉన్నాడు. చెప్పలేని భావాలు, మానసిక ఒత్తిడితో బాధపడేవారికి హగ్ థెరపి ద్వారా ఉపశమనం కలిగించవచ్చునని అంటున్నాడు హోటన్. జీవితంపై విసుగు చెందిన వారు, ఒంటరిగా ఫీల్ అయ్యేవారు హోటన్‌ను సంప్రదిస్తే.. అతను వారి వద్దకే వెళ్లి కౌగిలించుకుని ఓదారుస్తాడు. అలా వారి బాధలన్నీ విని, వారికి ధైర్యం చెబుతాడు. అయితే, కౌగిలింతలతో ప్రేమను పంచడానికి హోటన్ కొంత మొత్తం చార్జ్‌గా తీసుకుంటున్నాడు. ప్రతి గంటకు రూ. 7,100 సర్వీస్ చార్జ్ తీసుకుంటాడు.
హోటన్ ఈ బిజినెస్ మొదలు పెట్టకంటే 10 సంవత్సరాల ముందు మానవ సంబంధాలు, బంధాలు, మానిసక పరిస్థితులు, వారిని ఎలా శాంతింపజేయాలి, వారి బాధలను ఎలా తొలగించాలనే అంశంపై అధ్యయనం చేసి, పట్టు సాధించాడు. అందుకే, అతని ట్రీట్‌మెంట్ కోసం బ్రిటన్ నివాసుతులు గంటకు 7 వేల రూపాయలు వెచ్చించి మరీ అతని వెచ్చని కౌగిలింతలతో తమ మనసులోని బాధలన్నింటినీ పోగొట్టుకుంటున్నారు.
మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..