Viral: చెవి నొప్పితో డాక్టర్ దగ్గరకు వెళ్లగా.. స్కానింగ్‌లో కనిపించిన దృశ్యం చూసి దెబ్బకు హడల్..

ఓ వ్యక్తికి విపరీతమైన చెవినొప్పి వస్తుండటం, అంతేకాకుండా దురద, రక్తస్రావం అవుతుండటంతో హుటాహుటిన..

Viral: చెవి నొప్పితో డాక్టర్ దగ్గరకు వెళ్లగా.. స్కానింగ్‌లో కనిపించిన దృశ్యం చూసి దెబ్బకు హడల్..
Ear Ache

Updated on: Dec 12, 2022 | 12:44 PM

ఓ వ్యక్తికి విపరీతమైన చెవినొప్పి వస్తుండటం, అంతేకాకుండా దురద, రక్తస్రావం అవుతుండటంతో హుటాహుటిన స్థానిక డాక్టర్‌ను సంప్రదించాడు. ఆసుపత్రిలోని వైద్యులు అతడి చెవికి పలు పరీక్షలు నిర్వహించి.. స్కానింగ్ చేశారు. అక్కడ వారికి కనిపించిన దృశ్యాన్ని చూసి దెబ్బకు భయపడ్డారు. ఇంతకీ వారికి ఏం కనిపించింది.? ఎందుకు హడలిపోయారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

వివరాల్లోకి వెళ్తే.. పోర్చుగల్‌కు చెందిన 64 ఏళ్ల వ్యక్తికి గత కొద్దిరోజులుగా చెవిలో విపరీతమైన నొప్పి ఉండటంతో పాటు దురద, రక్తస్రావం లాంటివి వస్తుండేవి. వాటిని భరించలేని అతడు.. స్థానికంగా ఉన్న ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడున్న వైద్యులు సదరు వ్యక్తి చెవికి పలు పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత స్కానింగ్ చేయగా.. అందులో కనిపించిన దృశ్యాన్ని చూసి దెబ్బకు హడలిపోయారు. అతడి చెవిలో మగ్గూట్ పురుగులు గూడు కట్టుకుని ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు ఇప్పటికే చెవిలోని కొంతమేర అవి తినేసి రంద్రం చేసినట్లు గమనించారు. దీంతో డాక్టర్లు వెంటనే ఆ చెవిని శుభ్రం చేసి.. లార్వా దశలో ఉన్న మగ్గూట్ పురుగులను బయటికి తీసేశారు. కాగా, అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండటంతో.. దాన్ని చూసి నెటిజన్లు భయపడిపోయి.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.(Source)