మరుగుజ్జులుగా ఉన్నవారు కొన్ని రోజూవారి జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కానీ ఎత్తు ఎలా ఉన్నా సరైన ఆలోచన ఉంటే ఏదేన సాధించవచ్చని నిరూపిస్తోంది మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన పూజ ఘోడ్. చిన్నప్పుడు పూజ బస్సు కూడా ఎక్కలేకపోయేది. పూజ ఎత్తు పెరగదని డాక్టర్ చెప్పినప్పుడు ఆమె తల్లి ఆందోళన చెందింది. ఆమె చదువు ఎలాగని భయపడిపోయింది. పూజ మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయలేదు. తాను ఏదైనా సాధించాలనే తపనతో పట్టుదలతో ఎం.కాం పూర్తిచేసింది. ఆ తర్వాత పాపడ్ వ్యాపారం ప్రారంభించింది. మరుగుజ్జు కావడం వల్ల చిన్నప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు అనేక అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ తన ఆత్మస్థైర్యం కోల్పోకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వైకల్యాన్ని జయించింది పూజ.
అయితే ఎం.కాం పూర్తిచేశాక బ్యాంక్ పరీక్ష రాసింది. కానీ అందులో ఫెయిలే అయింది. దీంతో ఆలోచనలో పడ్డ పూజ.. తన తండ్రికి ఉన్న చిన్న అప్పడాల వ్యాపారాన్ని విస్తరించాలని భావించింది. బ్యాంకు నుంచి రుణం తీసుకుంది. ఆ డబ్బుతో పెద్ద యంత్రాలు తెప్పింది కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఒక్కప్పుడు తన వైకల్యం కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న పూజ ఇప్పుడు తానే ఉపాధి దొరక్క ఇబ్బంది పడుతున్న మహిళలు ఉద్యోగాలు ఇచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..