Memes on petrol price: సెంచరీ కొట్టిన పెట్రోల్.. నెటిజన్ల ఫన్నీ మీమ్స్ చూస్తే నవ్వాపుకోలేరు..

మీ బైక్ లేదా కారుపై ఎక్కడికైనా ప్రయాణించాలనుకుంటున్నారా..? అయితే ఒక్క నిమిషం ఆగి జేబులో దండిగా డబ్బులు ఉన్నాయో, లేదో చూసుకోండి.

Memes on petrol price:  సెంచరీ కొట్టిన పెట్రోల్.. నెటిజన్ల ఫన్నీ మీమ్స్ చూస్తే నవ్వాపుకోలేరు..

Updated on: Feb 17, 2021 | 9:33 AM

Memes on petrol price: మీ బైక్ లేదా కారుపై ఎక్కడికైనా ప్రయాణించాలనుకుంటున్నారా..? అయితే ఒక్క నిమిషం ఆగి జేబులో దండిగా డబ్బులు ఉన్నాయో, లేదో చూసుకోండి. ఎందుకంటే పెద్ద నగరాల్లో పెట్రోల్‌ ధరలు ఏకంగా సెంచరీ మార్క్ రీచ్ అయ్యాయి. త్వరలోనే మీ ఏరియాకి కూడా ఈ బాదుడు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇండియాలో కూడా చమరు ధరలు అకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు పెరుగుతూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రాజస్థాన్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పెట్రోల్ రేట్ సెంచరీ మార్క్ దాటగా.. తాజాగా భోపాల్‌లో ప్రీమియం పెట్రోల్ ధర లీటరు వంద రూపాయలు దాటేసింది. మధ్యప్రదేశ్‌లోని ఇతర నగరాల్లోనూ ఇంధనం ధరలు సెంచరీ మార్క్ దాటేశాయి.

పెట్రోల్ ధర వంద రూపాయలు దాటడంపై వాహనదారులను తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భోపాల్ లో ఓ వాహనదారుడు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు.పెట్రోల్ పంప్ వద్ద నిలబడి ఒక చేత్తో హెల్మెట్, మరో చేతితో బ్యాట్ ధరించి ‘సెంచరీ’ సంకేతమిచ్చాడు. దీనిపై సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా మీమ్స్ పుట్టుకొస్తున్నాయి. పెట్రోల్ బంక్ మీటర్‌లో 100 మార్క్ ఫొటోలు సందడి చేస్తున్నాయి.

కాగా, ఇప్పటికే పలు నగరాల్లో పెట్రోల్ ధర సెంచరీ కొట్టిందని..త్వరలోనే అంతటా 100 మార్క్ చేరుకోవడం ఖాయమని సోషల్ మీడియాలో ట్వీట్ల మోత మోగుతోంది. సెంచరీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు ఇండియా రెడీగా ఉందని ఫన్నీ మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. అలాగే ‘కఠోర శ్రమ, పోరాటంతో ఎట్టకేలకు పెట్రోల్‌ సెంచరీ చేసింది’ అంటూ ఒక ట్విట్టర్ యూజర్ భోపాల్ యువకుడి ఫోటోను షేర్ చేశాడు. పెట్రోల్ ప్రైజ్ అంటూ దానికి హ్యాష్ ట్యాగ్ ఇచ్చాడు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Also Read:

Today Horoscope: ఫిబ్రవరి 17 రాశి ఫలాలు.. ఆ రాశి వారికి బాకీలు వసూలు అవుతాయి.. వివాదాలు పరిష్కారం అవుతాయి

IPL 2021 Auction: సురేశ్ రైనా రాక జట్టుకు మరింత ఊరట.. చెన్నై జట్టుకు సూచనలిస్తున్న టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్..

ఏపీ పంచాయతీ ఎన్నికల లైవ్ అప్‌డేట్స్ దిగువన చూడండి: