
అదృష్టం అనేది మన నుదిటి రాతలో రాసి ఉన్నట్లయితే.. అది ఏ రూపంలోనైనా మనకు దక్కక మానదు. అందుకే అప్పుడప్పుడూ కొంతమంది అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతూ.. ఓవర్‌నైట్‌లో లక్షాధికారులు అవుతున్నారు. సరిగ్గా ఈ యూఎస్ మహిళకు కూడా ఇదే జరిగింది. పారేయాలనుకున్న ఓ లాటరీ టికెట్ ద్వారా ఏకంగా కోట్లలో జాక్‌పాట్ దక్కించుకుంది. దీంతో ఆమె ఆనందానికి అస్సలు అవధులు లేవు. ఇంతకీ అసలు ఆ స్టోరీ ఏంటంటే..?
రోపర్‌కు చెందిన 60 ఏళ్ల జాక్వలిన్ లేహ్‌లోని ఓ స్టోర్ నుంచి ‘నార్త్ కరోలినా ఎడ్యుకేషన్ లాటరీ’ టికెట్ హాట్ ‘5’ను ఐదు డాలర్లకు కొనుగోలు చేసింది. కొన్నప్పుడు బాగానే ఉంది గానీ.. ఆ తర్వాతే ఎక్కడో ఒక సందేహం.. ప్రతీ లాటరీ టికెట్‌కు లాటరీ తగులుతుందా.? అని జాక్వలిన్ అనుకుంది. అనుకున్నదే తడువుగా ఆ టికెట్‌ను చెత్తబుట్టలో పారేయాలనుకుంది. అయితే ఇంతలో ఎందుకైనా మంచిదని.. మరొక్కసారి చెక్ చేయగా.. ఆమె లాటరీ టికెట్ ద్వారా 2 లక్షల డాలర్లు(ఇండియన్ కరెన్సీలో రూ. 2.23 కోట్లు) గెలుచుకుంది.
‘నేను ఇంతకు ముందెన్నడూ ఇలా గెలుచుకోలేదు. పారేద్దామనుకున్న లాటరీ టికెట్‌కు ఇంత పెద్ద మొత్తం రావడం అన్నది అస్సలు నమ్మశక్యం కావట్లేదు’ అని జాక్వలిన్ చెప్పుకొచ్చింది. ట్యాక్స్‌లు పోగా వచ్చే మిగతా డబ్బును తన కారు లోన్ చెల్లించడానికి, ఇతర అవసరాలకు వినియోగించుకుంటానని ఆమె చెబుతోంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ న్యూస్ కోసం..