Low Credit Score: క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? రుణం ఇవ్వమన్నారా? అయితే ఇలా ప్రయత్నించి చూడండి..

|

Mar 27, 2021 | 4:14 AM

Low Credit Score: ఏదైనా బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ నుండి రుణం తీసుకునే ముందు, సివిల్ / క్రెడిట్ స్కోరు గురించి తెలుసుకోవాలి.

Low Credit Score: క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? రుణం ఇవ్వమన్నారా? అయితే ఇలా ప్రయత్నించి చూడండి..
Credit Score
Follow us on

Low Credit Score: ఏదైనా బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ నుండి రుణం తీసుకునే ముందు, సివిల్ / క్రెడిట్ స్కోరు గురించి తెలుసుకోవాలి. ఒక వ్యక్తికి రుణం ఇస్తారా? లేదా? అని నిర్ణయించడానికి, ఆర్థిక సంస్థలు మొదట క్రెడిట్ స్కోరునే చూస్తాయి. వ్యక్తిగత రుణాల నుండి అన్ని రకాల రుణాల కోసం క్రెడిట్ స్కోరు తనిఖీ చేయబడుతుంది. వాస్తవానికి, ఈ ఆర్థిక సంస్థలకు క్రెడిట్ స్కోరు సహాయంతో రుణగ్రహీతగా మీ ప్రవర్తన ఎలా ఉంటుందో అంచనా వేస్తాయి. ఇంతకు ముందు మీరు ఎంత అప్పు తీసుకున్నారు? సక్రమంగా చెల్లించారా? లేదా? మీకు ఎంత మేరకు అప్పు ఇవ్వొచ్చు.. అనేది ఈ సివిల్ స్కోర్ ద్వారా తెలుస్తుంది.

ఇంకా చెప్పాలంటే.. మీరుకు రుణం ఇవ్వొచ్చా? లేదా? అనేది ఈ క్రెడిట్ స్కోర్ చెబుతుంది. క్రెడిట్ స్కోర్ ప్రమాణాలు 300 నుంచి 900 వరకు ఉంటాయి. ఒక వ్యక్తికి 700 పాయింట్లు లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే.. మంచి క్రెడిట్ స్కోర్‌గా పరిగణిస్తారు. అది అతను రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తాడని చెప్పడానికి నిదర్శనంగా పేర్కొంటారు. క్రెడిట్ స్కోర్ గనుక ఎక్కువగా ఉంటే.. బ్యాంకుల నుంచి ఎక్కువ రుణం పొందే అవకాశం కూడా ఉంటుంది.

ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ చాలా తక్కువగా ఉంటే మీ పరిస్థితి ఏంటి? అత్యవసర పరిస్థితుల్లో మీరు రుణం తీసుకోలేరా? మీరు కొత్త కస్టమర్, మీ క్రెడిట్ స్కోరు ఇంకా క్రియేట్ చేయలేకపోతే ఏం చేయాలి? ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నప్పటికీ రుణం పొందగలం అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తక్కువ మొత్తంలో రుణం తీసుకోండి: మీ క్రెడిట్ స్కోరు చాలా తక్కువగా ఉండి.. మీరు పెద్ద మొత్తాన్ని రుణంగా తీసుకోవాలనుకుంటే మాత్రం కుదరదు. బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు పెద్ద మొత్తంలో రుణం ఇవ్వడానికి వెనుకాడతాయి. పెద్ద మొత్తంలో రుణాలు ఇస్తే చెల్లిస్తారో లేదో అనే అనుమానంతో బ్యాంకులు అంతటి సాహసం చేయవు. అందుకే.. మీరు ముందుగా చిన్న మొత్తా్న్ని రుణంగా తీసుకోవాలి. కొంతకాలం తరువాత.. అదే బ్యాంక్ / ఆర్థిక సంస్థ నుండి లోన్ టాపప్‌‌ను ఎంచుకోవాలి. అయితే, ఇది మీరు మొదటి వాయిదాలను సకాలంలో చెల్లించినట్లయితే మాత్రమే సాధ్యమవుతుంది. మీరు వాయిదాలను సకాలంలో చెల్లించినట్లయితే సదరు బ్యాంకు టాపప్ ఆప్షన్‌లో భాగంగా మరికొంత రుణాలు మంజూరు చేస్తాయి. అయితే, ఇక్కడ మరో ప్రధాన విషయాన్ని మీరు గుర్తించాలి. మీ నెలవారి బడ్జెట్‌ మేరకు తక్కువ వాయిదాలను ఎంచుకోండి. ఫలితంగా తక్కువ వడ్డీలు చెల్లించేలా ప్లాన్ చేసుకోవాలి. ఇది రుణగ్రహీతకు మేలు చేస్తుంది. పైగా మీ క్రెడిట్ స్కోర్‌ను కూడా పెంచుతుంది.

మీ ఆదాయానికి ప్రూఫ్స్ ఇవ్వాలి: రుణం ఇచ్చే ఆర్థిక సంస్థలు.. రుణగ్రహీత క్రెడిట్ స్కోర్‌తో పాటు, వారి జీతం, ఆదాయ వనరులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. మీ క్రెడిట్ స్కోరు తక్కువగా ఉంటే, మీ జీతం పెరుగుదల, వార్షిక బోనస్ లేదా ఇతర అదనపు ఆదాయ వనరులకు సంబంధించి రుజువుగా బ్యాంక్ స్టేట్మెంట్‌ను సమర్పించవచ్చు. ఈ పత్రాలను సమర్పించిన తరువాత, మీరు ఆర్థికంగా సురక్షితంగా ఉన్నారని నిరూపించగలుగుతారు. దాంతో రుణం సకాలంలో తిరిగి చెల్లి్స్తారనే నమ్మకం బ్యాంక్‌లలోనూ కలుగుతుంది.

నామిని ద్వారా తీసుకోవచ్చు: మీ క్రెడిట్ స్కోరు తక్కువగా ఉంటే, మీరు నామినీ ద్వారా రుణం పొందవచ్చు. అయితే దీనికి కూడా ఒక షరతు ఉంది. సదరు నామినీ క్రెడిట్ స్కోర్ కూడా మంచిగా ఉండాలి. వారు కూడా మంచి సంపాదనాపరులై ఉండాలి. అలాంటి వారు మీకు నామినీగా ఉంటే మీ పని పూర్తయినట్లే.

Also read:

West Bengal Elections 2021: మరికొద్ద గంటల్లో ఎన్నికలు.. టీఎంసీ పార్టీ కార్యాలయం ముందు బాంబ్ పేలుళ్లు.. పశ్చిమబెంగాల్‌లో తీవ్ర ఉద్రిక్త..

Vijayawada Durga Temple: ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం.. మునుపెన్నడూ లేని విధంగా ఇంద్రకీలాద్రి భూములును..