Google Search: గూగుల్‌లో వీటిని ఎప్పుడు వెతకకండి.. జైలుకి వెళుతారు..!

| Edited By: Ravi Kiran

May 18, 2022 | 10:05 AM

Google Search: ఆధునిక కాలంలో ఏ సమాచారం కావాలన్నా అందరు గూగుల్‌లోనే వెతుకుతారు. దీని ద్వారా మనకు కావలసిన సమాచారాన్ని సులభంగా పొందుతాం.

Google Search: గూగుల్‌లో వీటిని ఎప్పుడు వెతకకండి.. జైలుకి వెళుతారు..!
Google Search
Follow us on

Google Search: ఆధునిక కాలంలో ఏ సమాచారం కావాలన్నా అందరు గూగుల్‌లోనే వెతుకుతారు. దీని ద్వారా మనకు కావలసిన సమాచారాన్ని సులభంగా పొందుతాం. అయితే గూగుల్‌లో ఏమి వెతకాలి ఏమి వెతకకూడదో కూడా తెలిసి ఉండాలి. లేదంటే చాలా ప్రమాదంలో పడుతారు. ఒక్కోసారి మనకు తెలిసి, తెలియకుండా కొన్ని విషయాల గురించి గూగుల్‌లో వెతకడం వల్ల జైలుకు వెళ్లే పరిస్థితులు తలెత్తుతాయి. అందుకే మీరు గూగుల్‌లో ఏ విషయాలను వెతకకూడదో తెలుసుకోవాలి. అలాంటి వాటి గురించి తెలుసుకుందాం.

బాంబును ఎలా తయారు చేయాలి

మీరు బాంబును ఎలా తయారు చేయాలి, బాంబును ఎలా అమర్చాలి వంటి విషయాలను గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు మీరు భద్రతా సంస్థల రాడార్‌లోకి వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఈ పరిస్థితిలో మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. మీరు జైలుకు కూడా వెళ్లవలసి ఉంటుంది. అందుకే ఉగ్రవాదం లేదా టెర్రర్‌కు సంబంధించిన విషయాలను వెతకడం మానుకోవాలి.

చైల్డ్ పోర్న్

భారత ప్రభుత్వం పోర్న్‌ను నిషేధించింది. ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితిలో మీరు Googleలో చైల్డ్ పోర్న్‌కు సంబంధించిన ఏదైనా సెర్చ్ చేస్తే మీరు పోక్సో చట్టం 2012లోని సెక్షన్ 14 ప్రకారం 5 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి. అందుకే చైల్డ్ పోర్న్‌కి సంబంధించిన వాటిని వెతకకండి.

గర్భస్రావం

భారతదేశంలో అబార్షన్‌కు సంబంధించి కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో మీరు గూగుల్‌లో అబార్షన్ పద్ధతుల కోసం సెర్చ్ చేస్తే నేరమని తెలుసుకోవాలి. దీనికి మీరు జైలు శిక్ష అనుభవించే అవకాశాలు ఉంటాయి.

సినిమా పైరసీ

ప్రస్తుతం చాలా సినిమాలు పైరసీ బారిన పడుతున్నాయి. ఈ పరిస్థితిలో మీరు గూగుల్‌లో పైరసీ కోసం వెతికితే నేరస్థులవుతారు. మీపై చర్య తీసుకోవచ్చు. సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952 ప్రకారం మీరు సినిమా పైరసీ చేస్తున్నట్లు తేలితే 3 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

LSG vs RR: లక్నోపై సూపర్ విక్టరీ సాధించిన రాజస్థాన్.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోకి..

Peppermint Tea: పుదీనా టీ తాగడం వల్ల అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు..!

Viral Video: కుక్క స్కేటింగ్‌ చేయడం ఎప్పుడైనా చూశారా.. తమాషా వీడియో..!