
ఆమె ఒక ప్రముఖ వ్యాపారవేత్త భార్య మాత్రమే కాదు, ప్రపంచ వేదికలపై భారతీయ ఫ్యాషన్ కు దిక్సూచిలా నిలిచే గ్లోబల్ ఐకాన్. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ఒక వేడుకలో ఆమె ధరించిన ఒక చిన్న ఉంగరం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఉంగరంలో మెరుస్తున్న పింక్ డైమండ్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే అది సాదాసీదా వజ్రం కాదు.. ప్రపంచంలోనే అత్యంత అరుదైన వజ్రాలలో ఒకటి. ఇంతకీ ఆ వజ్రం ప్రత్యేకత ఏంటి? ఆ సోషల్ మీడియా సెన్సేషన్ ఎవరు?
వజ్రాలన్నింటిలోనూ పింక్ డైమండ్స్ చాలా అరుదుగా లభిస్తాయి. ఆస్ట్రేలియాలోని ఆర్గిల్ గని మూతపడిన తర్వాత వీటి లభ్యత మరింత తగ్గిపోయింది. తాజాగా ఈ స్టార్ సెలబ్రిటీ వేలికి మెరుస్తున్న ఈ వజ్రం దాదాపు 10 క్యారెట్ల కంటే ఎక్కువ బరువు ఉంటుందని అంచనా. దీని రంగు, స్వచ్ఛత పరంగా చూస్తే ఇది అత్యంత నాణ్యమైన వజ్రంగా నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక క్యారెట్ పింక్ డైమండ్ ధర కోట్లలో ఉంటుంది. అంటే ఈ ఉంగరం ధర ఊహకందని స్థాయిలో ఉంటుందని స్పష్టమవుతోంది.
కేవలం ఉంగరమే కాదు, ఆమె ధరించే ప్రతి వస్తువులోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది. విదేశీ పర్యటనల్లో ఆమె వేసుకునే దుస్తులు, చేతిలో ఉండే బ్యాగులు అన్నీ ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్లకు చెందినవే. లండన్, ముంబై నగరాల్లో విలాసవంతమైన భవంతుల్లో నివసించే ఈమె, బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అందరితోనూ మంచి స్నేహసంబంధాలను కలిగి ఉంటుంది. ఫ్యాషన్ ప్రపంచంలో ఆమెను ‘క్వీన్ ఆఫ్ లగ్జరీ’ అని పిలుచుకోవడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.
Poonawala With Ring
ప్రపంచాన్ని తన ఫ్యాషన్ తో ఆకట్టుకుంటున్న ఆ సెలబ్రిటీ మరెవరో కాదు.. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అదర్ పూనావాలా భార్య నటాషా పూనావాలా! రీసెంట్‌గా ఆమె షేర్ చేసిన ఫోటోల్లో ఈ పింక్ డైమండ్ రింగ్ హైలైట్‌గా నిలిచింది. ఈ ఉంగరం ధర కొన్ని వందల కోట్లలో ఉండవచ్చని సమాచారం. గతంలో జరిగిన హాంకాంగ్ వేలంలో ఇలాంటి పింక్ డైమండ్ రింగ్ దాదాపు రూ. 580 కోట్లకు అమ్ముడైందంటే, నటాషా దగ్గర ఉన్న ఈ వజ్రం విలువ ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అరుదైన వజ్రాలను సేకరించడం నటాషా పూనావాలాకు ఉన్న అభిరుచుల్లో ఒకటి. ఈ పింక్ డైమండ్ రింగ్ ఆమె రాయల్ కలెక్షన్‌లో మరో మణిహారంగా చేరింది. ఏది ఏమైనా, ఆమె ఫ్యాషన్ సెన్స్ మరియు ఆ విలాసవంతమైన జీవనశైలి చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు!