School on a scooter : కరోనా మహమ్మారి కారణంగా పేద విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులకు దూరంగా ఉన్నారు. నెట్‌వర్క్ సదుపాయం లేక గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులు పడ్డ కష్టాలు ఇంతా అంతాకాదు. స్మార్ట్‌ఫోన్‌లు కొనే స్తోమత లేక చాలామంది విద్యను కోల్పోయారు. ఈ సంక్షోభ సమయంలో అటు ఉపాధ్యాయులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులను ఆదుకునేందుకు, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు యత్నించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీవాస్తవ వార్తల్లో నిలిచారు.
పేద విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్‌లను కొనివ్వడమేకాదు, తనకున్న పరిమితమైన వనరులతో విద్యార్థులకు పుస్తకాలు అందుబాటులో ఉండేలా చొరవ తీసుకున్నారు శ్రీవాస్తవ. తన స్కూటర్‌పైన బ్లాక్‌బోర్డ్ ఏర్పాటు చేసి రోడ్డు వారగా బండి ఆపి పాఠాలు బోధిస్తారు. బ్లాక్‌బోర్డ్ మరో వైపున రంగు రంగుల పుస్తకాలతో మినీ లైబ్రరీ ఆకట్టుకుంటోంది. తన లైబ్రరీలోని పుస్తకాలను విద్యార్థులు 2-3 రోజులు తమ వద్ద ఉంచుకోవచ్చు. పిల్లలు చదువుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. దీంతో ఆయనపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
భవిష్యత్ తరాలకు మనం ఇవ్వలేక అరుదైన ఆస్తి ఏమైనా ఉంది అంటే అది విద్య మాత్రమే. ఎన్నో సామాజిక రుగ్నతలు అధిగమించడానికి కూడా అదే మెడిసిన్. ఎవరైనా మీ నుంచి ఏదైనా లాక్కోగలరు కానీ, మీ విద్యను, నాలెడ్జ్‌ను లాక్కోలేరు. అంత గొప్ప విద్యను ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా విద్యార్థులకు అందించడానికి తీవ్రంగా శ్రమిస్తోన్న ఈ మాస్టారుకు ఎన్ని వందనాలు చెప్పినా తక్కువే. హ్యాట్సాఫ్ శ్రీవాస్తవ గారు.
Also Read: మట్టిలో మాణిక్యం మరోసారి మెరిసింది.. ఉసేన్ బోల్ట్‌ను దాటి ఎగసింది.. వారెవ్వా, శ్రీనివాసగౌడ
విచిత్ర దొంగతనం.. ప్రభుత్వ వాహనం పార్ట్స్ మొత్తం లేపేశారు.. ఫార్మాలిటీకి బాడీ మాత్రం ఉంచారు