Special Flower: అమ్మ బాబోయ్.. ఈ పువ్వు ధర మార్కెట్లో కోట్లు..! మీ ఇంట్లో ఉందేమో చూసుకోండి.. !

|

Mar 18, 2023 | 5:13 PM

దేవతల పూజల కోసం, మహిళల జుట్టు అలంకరణ, గృహ అలంకరణ, మహిళలకు ప్రపోజ్ కోసం మొదలు అనేక అంశాల్లో పువ్వులను వినియోగిస్తారు. కొన్ని పూలు చౌక ధరలకే అందుబాటులో ఉంటే..

Special Flower: అమ్మ బాబోయ్.. ఈ పువ్వు ధర మార్కెట్లో కోట్లు..! మీ ఇంట్లో ఉందేమో చూసుకోండి.. !
Special Flowers
Follow us on

దేవతల పూజల కోసం, మహిళల జుట్టు అలంకరణ, గృహ అలంకరణ, మహిళలకు ప్రపోజ్ కోసం మొదలు అనేక అంశాల్లో పువ్వులను వినియోగిస్తారు. కొన్ని పూలు చౌక ధరలకే అందుబాటులో ఉంటే.. మరికొన్ని పూలు చాలా ఖరీదైనవి ఉంటాయి. అయితే, సాధారణంగా మనం చూసినంత వరకు వెలలో ధర పలకడం విని ఉంటారు. కానీ, లక్షలు, కోట్ల రూపాయల విలువ చేసే పూల గురించి ఎప్పుడైనా విన్నారా? అయితే, అలాంటి అరుదైన పుష్పాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. అవి ఎంత స్పెషల్ అంటే.. ఒక్క పువ్వును కొనుగోలు చేయాలంటే చేతిలో కోట్ల రూపాయలు ఉండాల్సిందే మరి.

ఖరీదైన పుష్పాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. కడుపుల్ పుష్పం(బ్రహ్మకమలం) చాలా ఖరీదైన పుష్పాల్లో ఒకటి. దీని విలువ ప్రపంచంలో ఇప్పటి వరకు అంచనా వేయలేదు. ఈ పువ్వును ఖరీదు చేయలేని పువ్వు అని కూడా అంటారు. ఇది ఒక రకమైన కాక్టస్. ఇది రాత్రిపూట మాత్రమే వికసిస్తుంది. శ్రీలంకలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పువ్వును తీయడం, కత్తిరించడం సాధ్యం కాదు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. దీని సువాసన వ్యక్తుల్ని మైమరపింపజేస్తుంది. ఈ పువ్వు వికసించిన కొన్ని గంటల్లోనే ఎండిపోతుంది.

2. జూలియట్ రోజ్. దీని ధర దాదాపు రూ. 130 కోట్లు. అవును, వినడానికి షాకింగ్‌గా ఉన్నప్పటికీ ఇది నిజంగా నిజం. కొన్ని వెబ్‌సైట్లలో, ఈ పువ్వు ధర 5 మిలియన్ డాలర్లుగా ఉంది. ఫ్లోరిస్ట్ డేవిడ్ ఆస్టిన్ దీనిని సృష్టించాడు. ఈ పువ్వు సృష్టించడానికి ఆస్టిన్‌కు దాదాపు 15 సంవత్సరాలు పట్టిందట. ఇది అనేక అరుదైన పూల జాతులను కలపడం ద్వారా సృష్టించడం జరిగింది. ఈ పువ్వును 2006 సంవత్సరంలో తొలిసారి విక్రయించడం జరిగింది.

ఇవి కూడా చదవండి

3. అర్కిడ్ పూల ధర మార్కెట్‌లో రూ. 16.54 కోట్లుగా ఉంది. చాలా మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు కలిసి ఈ పువ్వును సృష్టించారు. షెన్‌జెన్ నాంగ్‌కే యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దాదాపు 8 ఏళ్లపాటు శ్రమించి ఈ పుష్పాని జీవం పోశారు. ఈ పువ్వు ప్రత్యేకత ఏంటంటే.. 4-5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వికసిస్తుంది. పువ్వును వికసించిన తరువాత వేలం వేస్తారు.

4. గోల్డ్ కినబాలు ఆర్కిడ్ పువ్వులు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇది మనేషియాలోని కినాబాలు నేషనల్ పార్క్‌లో ఎక్కువగా ఉంటాయి. ఇండియన్ మార్కెట్‌లో దీని ధర రూ. 4.96 లక్షలు. ఈ పువ్వు వికసించడానికి సంవత్సరాలు పడుతుంది. అందుకే ఇది అంత స్పెషల్‌గా నిలిచింది.

5. కుంకుమ పువ్వు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన దేశంలో కుంకుమ పువ్వుకు ప్రత్యేక స్థానం ఉంది. కుంకుమ పువ్వును రంగు, రుచి కోసం చాలా వంటలలో ఉపయోగిస్తారు. 80 వేల కుంకుమ పువ్వుల నుంచి 500 గ్రాముల కుంకుమ పువ్వు రేకులను మాత్రమే సేకరించగలరు. ఇది కిలో రూ. 3 లక్షలపైగానే ఉంటుంది.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..