ప్రపంచంలో అన్నింటికన్నా గొప్పది అమ్మ ప్రేమ. మనుషుల్లోనే కాదు అన్ని ప్రాణుల్లోనూ ఆ ప్రేమ అమరం, అఖిలం. మన చుట్టూ ఉండే జంతువులు తమ పిల్లలను ఎంత ప్రేమ చూసుకుంటాయో మనం తరచు చూస్తూనే ఉంటాం. పిల్లల జోలికి వస్తే ప్రాణాలు పోయేదాకా పోరాడుతుంటాయి. ఇక సోషల్ మీడియా లోను ఇలాంటి వీడియోలు దర్శమిస్తుంటాయి. తరచూ సోషల్ మీడియాలో కనిపించే కొన్ని వీడియోలు జంతువుల్లో ఉండే సాదు స్వభావాన్ని తెలియజేస్తున్నాయి. అటువంటిదే ఈ వీడియో కూడా.
కోతి నుంచి మనిషి వచ్చాడు అనేది నిజం అందుకే మనకు కోతులకు చాలా పోలికలు ఉంటాయి. ఇక్కడ ఒక కోతి ఓ చిన్నారి పై అమ్మప్రేమను కురిపించింది. ఓ బుడ్డొడిని హత్తుకుని ముద్దులు పెడుతోంది. కన్న తల్లి తన బిడ్డని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే.ఆ కోతి చిన్నారిని విడిచిపెట్టలేక మరింత దగ్గరికి హత్తుకుంటోంది. ఆ కోతి ఆ చిన్నారిని సొంత బిడ్డలా ముద్దడుతూ సొంత తల్లిని కూడా చెయ్యి వెయ్యనివ్వట్లేదు. బిడ్డపై కోతి ప్రేమను చూసిన స్థానికులు ఆశ్చర్యపోయి చూస్తుండిపోయారు. ఐతే తల్లి తన బాలుడిని ఎత్తు కోవాలని ఎంత ప్రయత్నించినా ఆ కోతి మాత్రం పిల్లవాడిని వదిలిపెట్టడం లేదు. పక్కనే ఉన్న స్థానికులు కొందరు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో చిన్నారిపై కోతి ప్రేమ నెట్టింట్లో వైరల్‌గా మారింది. మూగ జీవి అయినా కూడా కోతి నిస్వార్థమైన మాతృ ప్రేమ చూపించడంలో మనుషులను మించిపోయిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ తల్లిప్రేమకు లక్షల్లో వ్యూస్, లైకులు పెరిగిపోతున్నాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :
చనిపోయినట్లుగా ‘ముంగూస్’ చిలిపి డ్రామాలు.. వైరల్ వీడియో.. చివరికి అదిరిపోయే ట్విస్ట్ .!