Millets Benfits: ఎదిగే పిల్లలకు చిరు ధాన్యాలు బెస్ట్.. ఇందులో ఉండే పోషకాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!

|

Apr 18, 2022 | 5:54 PM

Millets Benfits: భారతదేశంలో సిరి ధాన్యాలు అత్యంత ప్రజాధారణ పొందినవి. వీటివల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఎన్నో వ్యాధులకి దివ్య ఔషధమని చెప్పవచ్చు.

Millets Benfits: ఎదిగే పిల్లలకు చిరు ధాన్యాలు బెస్ట్.. ఇందులో ఉండే పోషకాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!
Millets Benfits
Follow us on

Millets Benfits: భారతదేశంలో సిరి ధాన్యాలు అత్యంత ప్రజాధారణ పొందినవి. వీటివల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఎన్నో వ్యాధులకి దివ్య ఔషధమని చెప్పవచ్చు. వీటిలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చిరుధాన్యాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో అమ్లాలు, పీచు పదార్ధాలు అధికంగా ఉంటాయి. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటే శరీరానికి కావాల్సిన రోజువారి పోషకాలన్నీ లభిస్తాయి. సిరిధాన్యాలనే తృణధాన్యాలు ఇంగ్లీష్ లో మిల్లెట్స్ అని పిలుస్తారు. భారతదేశంలో ప్రధానంగా జొన్నలు, సజ్జలు, రాగులు, బజ్రా, బుక్వీట్, తదితర ధాన్యాలు మిల్లెట్స్‌ కిందికి వస్తాయి. ముఖ్యంగా ఎదిగే వయస్సున్న పిల్లలకు చిరుధాన్యాలను అందించడం వల్ల పోషకాహార లోపం తొలగించవచ్చు. శారీరక ఎదుగుదల వేగంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇటీవల కాలంలో చాలామంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ నేపధ్యంలో చిన్నారులకు బియ్యంతో వండిన అన్నాన్ని తగ్గించి కొంత మేర చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహారపదార్ధాలను అందించటం వల్ల పోషకాహార లోపాన్ని తగ్గించవచ్చు.

వీటిని ఆహారంగా తీసుకుంటే రక్తంలో గ్లూకోస్ శాతం తగ్గుముఖం పడుతుంది. దీని వల్ల మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. క్రమంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిరుధాన్యాల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. దీని వల్ల దంతాలు, ఎముకలు గట్టిపడుతాయి. సిరిధాన్యాలు పీచుని అధికంగా కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని తింటే కిడ్నీలో, పిత్తాశయంలో రాళ్ళు రావటం వంటి సమస్యలు తగ్గుతాయి. వీటిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కొవ్వు తగ్గుతుంది. అసిడిటీ ఉన్నవారు వీటిని తినటం వల్ల చాలా మేలు జరుగుతుంది.

కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, కొర్రలు, సజ్జలు, రాగులు, వరిగలు, జొన్నలు వంటి ధాన్యాలు అన్నిప్రాంతాల్లో అందరికి దొరికేవే. చాలా మందికి వీటిపై సరైన అవగాహన లేకపోవటం వల్ల తినేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. వీటిలో ఎలర్జీ కలిగించే గుణం ఉండదు కనుక చిన్న పిల్లలకు కూడా తినవచ్చు. ఊబకాయం, కాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు వీటిని రోజు తింటే మంచిది. తక్కువ తినగానే పొట్ట నిండుగా అనిపించటం వల్ల ఊబకాయం కూడా తగ్గుతుంది. కాన్సర్ వ్యాధి బారిన పడకుండా మనల్ని కాపాడుతాయి.

TSPSC: గ్రూప్స్‌ పోస్టులకి అప్లై చేస్తున్నారా.. ఇలా చేసేవారిపై కఠిన చర్యలు..!

Health News: మహిళల్లో ఈ వ్యాధి ఎక్కువ.. లక్షణాలు, చికిత్స విధానం తెలుసుకోండి..!

Dinesh Karthik: దినేశ్‌ కార్తీక్ మళ్లీ చెలరేగాడు.. ఆ బంగ్లాదేశ్ బౌలర్ వేసిన ఒకే ఓవర్లో 28 పరుగులు..!