మరికొద్ది నిమిషాల్లో పెళ్లి.. అంతలోనే సైరన్ మోగిస్తూ వచ్చిన పోలీస్ వాహనం.. ఏం జరిగిందంటే..

|

Dec 25, 2020 | 5:37 AM

మరికొన్ని నిమిషాల్లో పెళ్లి.. అక్షింతలు వేసి నవ దంపతులను ఆశీర్వదించేందుకు అతిథులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో పెద్ద ట్విస్ట్..

మరికొద్ది నిమిషాల్లో పెళ్లి.. అంతలోనే సైరన్ మోగిస్తూ వచ్చిన పోలీస్ వాహనం.. ఏం జరిగిందంటే..
marriage
Follow us on

Marriage: మరికొన్ని నిమిషాల్లో పెళ్లి.. అక్షింతలు వేసి నవ దంపతులను ఆశీర్వదించేందుకు అతిథులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. ‘కుయ్.. కుయ్.. కుయ్..’ అంటూ శబ్దంతో ఓ పోలీసుల వాహనం పెళ్లి వేదిక వద్దకు వచ్చింది. దాంతో అంతా కంగారుపడిపోయారు. తీరా చూస్తే వధువే ఆ పోలీసులను పిలిచిందని తేలింది. తనకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారంటూ ఓ యువతి ‘డయల్ 100’కు ఫోన్ చేసింది. పెళ్లి ఆపాలంటూ పోలీసులను వేడుకుంది. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేయడం.. పెళ్లి ఆగిపోవడం అంతా చకచకా జరిగిపోయాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడలో చోటు చేసుకుంది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. కురవి మండలం సీరోలు కాంపెల్లికి చెందిన యువతికి మరిపెడ మండలం గుండెపుడి చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది. అయితే వరుడు సదరు యువతికి నచ్చలేదు. పెళ్లి సమాగ్రి కొనుగోలు సమయంలో ఏదో తేడా కొట్టడంతో.. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పేసింది. అతనితో పెళ్లి ఇష్టం లేదంటూ కుండబద్దలు కొట్టింది. అయితే యువతి తల్లిదండ్రులు అందుకు ససేమిరా అన్నారు. బలవంతంగా పెళ్లికి ఏర్పాట్లు చేశారు. దాంతో సదరు యువతి నేరుగా 100 కి ఫోన్ చేసింది. బలవంతపు పెళ్లి చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయగా.. పోలీసులు వచ్చి ఆ పెళ్లిని ఆపేశారు. అయితే దానికి ముందు పోలీసులు సదరు యువతికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దాంతో చేసేదేమీ లేక.. పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

 

Also read:

Business News: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకనుంచి డీటీహెచ్ సంస్థలకు 20 ఏళ్ళ లైసెన్స్..

ఢిల్లీలో ఆప్ నేత ఆధ్వర్యంలోని జలమండలి ఆఫీసుపై బీజేపీ కార్యకర్తల దాడి, విధ్వంసం , రైతుల నిరసనకు మద్దతు తెలిపినందుకట