విద్యుత్‌షాక్‌కు గురై చనిపోయిన చిలుక.. సంప్రదాయబద్ధంగా రామచిలుకకు అంతిమ సంస్కారాలు

|

Mar 30, 2021 | 10:17 PM

ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తి పక్షుల పట్ల తన ప్రేమను చాటుకున్నాడు. ఓ చిలుక హైటెన్షన్ వైరు తగిలి చనిపోయింది. దీంతో చిలుకకు అంతిమ క్రియలు నిర్వహించాడు.

విద్యుత్‌షాక్‌కు గురై చనిపోయిన చిలుక.. సంప్రదాయబద్ధంగా రామచిలుకకు అంతిమ సంస్కారాలు
Man Made Parrot Funerals In Khammam District
Follow us on

parrot funerals in khammam: ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తి పక్షుల పట్ల తన ప్రేమను చాటుకున్నాడు. ఓ చిలుక హైటెన్షన్ వైరు తగిలి చనిపోయింది. దీంతో తీవ్రంగా చలించినపోయిన ఓ వ్యక్తి.. ఆ చిలుకకు అంతిమక్రియలు నిర్వహించాడు.

జంతు ప్రేమికులు.. ఏ జంతువుకైనా, పక్షులకైనా చిన్న గాయం తగిలినా తట్టుకోలేరు. వారికే అయినంతగా బాధ పడిపోతుంటారు. అలాంటిది చనిపోతే.. ఇంకెంత బాధగా ఉంటుంది. ఖమ్మం జిల్లాకు చెందిన రావుట్ల సత్యనారాయణ కూడా తట్టుకోలేకపోయాడు. ఓ రామ చిలుక తన కళ్లెదుటే విద్యుత్‌ హై టెన్షన్‌ వైర్లకు తగిలి గిలగిల కొట్టుకుని మృతిచెందింది. కళ్లెదుటే రామచిలుక చనిపోవడాన్ని తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా దాని రుణం తీర్చుకోవాలనుకున్నాడు. మనుషుల్లా రామచిలుకకు కూడా అంత్యక్రియలు నిర్వహించాలనుకుని.. అనుకున్నదే తడువుగా ఆచరణలో పెట్టాడు.

చనిపోయిన రామచిలుకకు సంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు నిర్వహించి రామభక్తిని చాటుకున్నాడు. ఇదే జిల్లాలో మేడేపల్లి నుండి కట్టకూరు వెళ్లే మార్గంలో ఓ రామ చిలుక కూడా ఇటీవల హఠాత్తుగా చెట్టు పై నుంచి కింద పడి మృతి చెందింది. దానికి కూడా స్థానిక రైతులు.. అంత్యక్రియలు జరిపించారు. మనుషులతో కలసి సహజీవనం సాగిస్తున్న పశువులూ, పక్షులు చనిపోయిన సందర్భాల్లో బాధ కలుగుతుందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.

అయితే, రామ నామంతో ఉన్న రామచిలుక చనిపోవడంతో అంత్యక్రియలు నిర్వహిస్తే మంచిదనే భావన ఇక్కడి వారిలో ఉంది. దానికి అనుగుణంగానే ఏ చిలుకకు అపాయం జరిగినా ముందుంటున్నారు. తమ భాగ్యంగా భావిస్తున్నారు. రామచిలుక కు అంత్యక్రియలు నిర్వహించటం రామునికి సేవ చేసినట్లుగా ఉందన్నారు. మనపై ఆధారపడి జీవించే పశువులూ, పక్షులు మరణించిన సందర్భాల్లో వాటిని అలా వదిలేయకుండా సంప్రదాయపద్దతిలో సాగనంపితేనే మంచిదని అంటున్నారు. తోటి జీవుల పట్ల జాలిని చూపడమే కాదు.. పర్యావరణాన్నీ కాపాడేలా ముందుండాలని కోరుతున్నారు.

ఇదీ చదవండిః  Five Foods in Your Diet : బరువు తగ్గడానికి.. ఆకలి వేయకుండా ఉండటానికి.. ఈ ఐదు రకాల ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోండి..