Viral: గర్ల్‌ఫ్రెండ్‌ను ఏదో కరిచిందంటూ ఆస్పత్రికి.. కాసేపటికే పోలీసుల ఎంట్రీ.. సీన్ కట్ చేస్తే.!

గర్ల్‌ఫ్రెండ్‌ను ఏదో కరిచిందని ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని.. ఠక్కున భయమేసి అక్కడ నుంచి పారిపోయాడు. ఆ తర్వాత కాసేపటికే పోలీసుల ఎంట్రీతో.. సీన్ రివర్స్ అయింది. నెక్స్ట్ సీన్ కోసం ఈ స్టోరీలో చూసేయండి మరి. ఓ లుక్కేయండి.

Viral: గర్ల్‌ఫ్రెండ్‌ను ఏదో కరిచిందంటూ ఆస్పత్రికి.. కాసేపటికే పోలీసుల ఎంట్రీ.. సీన్ కట్ చేస్తే.!
Viral News

Updated on: Jul 16, 2025 | 12:18 PM

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. తన ప్రియురాలికి ఏదో కరిచిందంటూ జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చిన ఈ వ్యక్తి.. ఆమెను అక్కడే జనరల్ వార్డులో వదిలేసి పారిపోయాడు. జాయిన్ చేసిన కాసేపటికే ఆమె మృతి చెందటంతో.. సీన్‌లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. చేతన్ కుక్రేజా అనే వ్యక్తి.. బీహార్‌కు చెందిన ఓ యువతితో మలన్‌పూర్ ప్రాంతంలో గత మూడు సంవత్సరాలుగా లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్నారు. ఇద్దరూ కలిసి ఒకే దగ్గర ఉద్యోగం చేసుకునేవారు. అయితే సదరు యువతిని పెళ్లి చేసుకున్న సమయంలో చేతన్ తన పేరును తప్పుగా చెప్పినట్టు తెలుస్తోంది. అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో.. భయంతో అక్కడ నుంచి పరార్ అయ్యాడు చేతన్. చికిత్స పొందుతూ ఆమె మరణించింది.

దీంతో ఆస్పత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే మురార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్‌ను చెక్ చేశారు. సదరు వ్యక్తి అస్పత్రికొచ్చిన ఆటో నెంబర్ ఆధారంగా.. ట్రేస్ చేసి అతడ్ని పట్టుకున్నారు. కాగా, నిందితుడు చేతన్‌పై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..