Knowledge: వాష్‌రూమ్‌, బాత్‌రూమ్‌, టాయిలెట్‌.. మూడూ ఒకటే కాదు.. మరి తేడా ఏంటో తెలుసా?

|

May 03, 2023 | 8:30 AM

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్ రూమ్, లావేటరీ, టాయిలెట్.. ఈ పదాలను మనం తరచుగా వింటూనే ఉంటాం. చూస్తూనే ఉంటాం. వాటిని వినియోగిస్తూనే ఉంటాం. మరి ఈ పదాలలో ఏది ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా? ఇంట్రస్టింగ్ విశేషాలు మీకోసం..

Knowledge: వాష్‌రూమ్‌, బాత్‌రూమ్‌, టాయిలెట్‌.. మూడూ ఒకటే కాదు.. మరి తేడా ఏంటో తెలుసా?
Restrooms
Follow us on

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్ రూమ్, లావేటరీ, టాయిలెట్.. ఈ పదాలను మనం తరచుగా వింటూనే ఉంటాం. చూస్తూనే ఉంటాం. వాటిని వినియోగిస్తూనే ఉంటాం. మరి ఈ పదాలలో ఏది ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా? ఇంట్రస్టింగ్ విశేషాలు మీకోసం..

బాత్‌రూమ్స్‌..

అత్యంత సాధారణ పదం బాత్రూమ్. బాత్రూంలో షవర్ నుండి టాయిలెట్ వరకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇందులో బకెట్, బాత్‌టబ్, సింక్, టాయిలెట్ సీట్ ఉంటాయి. అయితే, బాత్రూమ్‌లో టాయిలెట్ సీట్ ఉండాల్సిన అవసరం లేదు. కొంతమంది దానిని విడిగా కూడా ఏర్పాటు చేస్తారు.

వాష్‌రూమ్స్..

వాష్‌రూమ్‌లో సింక్, టాయిలెట్ సీటు రెండూ ఉంటాయి. అందులో అద్దం కూడా ఏర్పాటు చేయొచ్చు. కానీ ఇక్కడ స్నానం చేయడానికి, బట్టలు మార్చుకోవడానికి అవకాశం ఉండదు. ఇవి ఎక్కువగా మాల్స్, సినిమా హాల్స్, ఆఫీసులు మొదలైన వాటిలో కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

రెస్ట్ రూమ్స్..

రెస్ట్‌రూమ్‌లో విశ్రాంతి అనే పదం వింటే, కొంతమందికి ఇది విశ్రాంతి స్థలం అని అనుకుంటారు. కానీ విశ్రాంతితో సంబంధం లేదు. వాస్తవానికి, ఇది అమెరికన్ ఇంగ్లీష్ నుంచి వచ్చిన పదం. అమెరికాలో వాష్‌రూమ్‌నే రెస్ట్‌రూమ్‌ అంటారు. అయితే, బ్రిటిష్ ఇంగ్లీషులో దీనిని వాష్‌రూమ్ అంటారు.

టాయిలెట్‌..

ఎక్కడైనా టాయిలెట్ అని రాసి ఉంటే టాయిలెట్ సీట్ మాత్రమే ఉంటుందని, హ్యాండ్ వాష్, ఛేంజ్ సదుపాయాలు ఉండవని అర్థం.

లావెటరీ..

ఈ లావెటరీ అనేది అంత జనాదరణ పొందిన పదం కాదు. ఇది లాటిన్ భాష నుండి ఉద్భవించిన పదం. లాటిన్‌లో లెవటోరియం అంటే వాష్ బేసిన్ లేదా వాష్‌రూమ్. క్రమంగా వాష్‌రూమ్‌ తన ఆ పదాన్ని ఆక్రమించింది. లావెటరీ అనేది కూడా కూడా వాష్‌రూమే.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..