Viral Video: ఈ బుడ్డోడు వయసులోనే చిన్నోడు..దయా గుణంలో చాలా పెద్దోడు.. పిల్లలంటే ఇలా ఉండాలి..

Viral Video: మనం ఎంత డబ్బు సంపాదించినా.. ఎంత ఎత్తు ఎదిగినా కాస్త జాలి, ఇతరులకు సేవ చేసే గుణం ఉండాలని చెబుతుంటారు. అయితే అంతా కమర్షియల్‌గా మారిన ఈ రోజుల్లో దయ, జాలి...

Viral Video: ఈ బుడ్డోడు వయసులోనే చిన్నోడు..దయా గుణంలో చాలా పెద్దోడు.. పిల్లలంటే ఇలా ఉండాలి..
Viral Video

Updated on: Apr 07, 2021 | 7:24 PM

Viral Video: మనం ఎంత డబ్బు సంపాదించినా.. ఎంత ఎత్తు ఎదిగినా కాస్త జాలి, ఇతరులకు సేవ చేసే గుణం ఉండాలని చెబుతుంటారు. అయితే అంతా కమర్షియల్‌గా మారిన ఈ రోజుల్లో దయ, జాలి అనే పదాలను భూతద్దం వేసి వెతికినా దొరకట్లేదు. మన ముందు ఆపదలో ఉన్న వారికి ఆదుకునే సమయం కూడా దొరకట్లేదు. ఎందుకంటే ఎవరి లైఫ్‌ వారిది.. ఎవరి బిజీ వారిది. కానీ తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఓ వీడియో దయా గుణం అంటే ఇలా ఉండాలని చెబుతోంది.
విపరీతంగా దంచి కొడుతోన్న ఎండల కారణంగా మానవులతో పాటు పక్షులు కూడా బాగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ క్రమంలో ఓ పావురం ఎండకు భరించలేక ఓ ఇంటి బాల్కనీ వెలుపల అవస్థలు పడుతోంది. ఈ విషయాన్ని గమనించిన ఆ ఇంటికి చెందిన కుర్రాడు.. దానికి నీటిని అందించాలనుకున్నాడు. అయితే చేతులు చిన్నవి కావడంతో ఆ పక్షిని అందుకోలేకపోయాడు. దీంతో ఇంట్లోకి వెళ్లి ఒక గరిట తీసుకొచ్చి దాని ద్వారా పక్షికి నీటిని అందించే ప్రయత్నం చేశాడు. గ్రిల్స్‌లో నుంచి చేతులు బయటకి పెట్టి.. పక్షిని అందుకునే క్రమంలో ఆ కుర్రాడు చేసిన ప్రయత్నం శబాష్‌ అనిపించకమానదు. ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌లో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక ఈ చిన్నారి దయా గుణం చూసిన నెటిజన్లు కుర్రాడికి ఫిదా అవుతున్నారు. ‘గ్లాడ్‌ బెస్‌ యూ’, ‘పిల్లలకు ఇలాంటి అలవాటు చేయాలి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

పావురానికి నీరందిస్తున్న వీడియో..

Also Read: Viral Video: వావ్‌ వాట్‌ ఏ డెడికేషన్‌.. వృత్తి ధర్మానికి అసలైన ఉదాహరణ.. చివరికి బాత్‌రూమ్‌లో ఉన్నా సరే..

చెట్టెక్కి కూర్చున్న రకుల్ ప్రీత్ సింగ్…స్పెషల్ రోజున అభిమానులకు మంచి సందేశం ఇచ్చిన బ్యూటీ..

LPG Booking In WhatsApp: ఇకపై గ్యాస్‌ బుకింగ్‌ మరింత సులువు.. వాట్సాప్‌లో కేవలం నిమిషాల్లోనే.. ఎలా చేసుకోవాలంటే..