Humanity is Still Alive: ఈరోజుల్లో సాటి మనిషి కష్టాల్లో ఉంటె ఆదుకోవాలని అని అంటేనే ఆలోచిస్తున్నాడు.. తనకు ఎందుకొచ్చిన గొడవ అంటూ పక్క నుంచి తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు.. అయితే ఒకొక్కసారి మనకు కనిపించిన సంఘటనలు మనిషిలో ఇంకా మానవత్వం ఉంది అనిపిస్తాయి.. అవి మనిషిలోని మంచితనానికి నిదర్శనంగా నిలుస్తాయి. తాజాగా అటువంటి ఓ ఘటనకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్అవుతుంది. వివరాల్లోకి వెళ్తే..
ఓ వీధి కుక్క యాక్సిడెంటల్ గా నడుము విరిగి రెండు కాళ్ళను కోల్పోయింది. దీంతో అది నడవడానికి చాలా కష్టపడుతుంది.. అది చూపరుల కంట తడిపెట్టించేదిగా ఉంది. అయితే ఆ కుక్క నడవడానికి పడుతున్న కష్టాన్ని గమనించిన ఓ గ్రామీణ డాక్టర్ కలిగిన కరుణతో కుక్క సులువుగా నడవగలుగుతోంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో చోటు చేసుకుంది.
సింగరాయపాలెం గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు షేక్ ఆషా కొద్ది రోజుల క్రితం తన నివాసానికి దగ్గర్లో ఓ వీధి శునకానికి నడుము, కాళ్లు విరిగిపోయి ఉండటాన్ని గమనించారు. దాన్ని చేరదీసి ఇంట్లో చిన్న పిల్లలు ఆడుకునే చక్రాల బండికి మార్పులు చేర్పులు చేసి శునకం నడుముకు ఇలా అమర్చారు. ఇప్పుడు ఆ శునకం ఎక్కడికైనా ఈజీగా వెళ్లగలుగుతుంది. ఎవరో ఆ కుక్కని చూసి ఫోటో సోషల్ మీడియా లో షేర్ చేశారు.. ఆ పిక్ వైరల్ అవుతుంది.
Also Read: ఈరోజు ఉత్కంఠంగా మారిన కార్తీక్ దీపం .. దీప, పిల్లల వద్దకు చేరుకున్న డాక్టర్ బాబు
ఈరోజు ఈ రాశివారి ఉద్యోగ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.. అందుకు ఏం చేయాలంటే..