Viral video : గెలిచిన ఆనందంలో ఆ సర్పంచ్ చేసిన పనికి అక్కడున్నవారంతా షాక్ అయ్యారు.. చివరకు..

|

Feb 27, 2021 | 3:16 PM

కొంతమంది గెలిచినా ఆనందాన్ని ఆపుకోలేరు..ఓడిన భాదను తట్టుకోలేరు. గెలిచిన తర్వాత కొంతమంది చేసే పనులు నవ్వును తెప్పిస్తాయి. మరికొన్ని షాక్ కు గురిచేస్తాయి.

Viral video : గెలిచిన ఆనందంలో ఆ సర్పంచ్  చేసిన పనికి అక్కడున్నవారంతా షాక్ అయ్యారు.. చివరకు..
Follow us on

Viral : కొంతమంది గెలిచిన ఆనందాన్ని ఆపుకోలేరు.. ఓడిన భాదను తట్టుకోలేరు. గెలిచిన తర్వాత కొంతమంది చేసే పనులు కొన్ని నవ్వును తెప్పిస్తాయి. మరికొన్ని షాక్ కు గురిచేస్తాయి. తాజాగా ఎన్నికల్లో గెలిచిన ఓ వ్యక్తి ఆనందంతో ఏకంగా గాల్లోకి డబ్బులను ఎగరేసాడు. ఇంతకు మనోడు గెలిచింది.. ఎంపీగానో లేక ఎమ్మెల్యేగానో కాదు సర్పంచ్ గా. కొంతమందికి అది గొప్పే అనుకోండి.. మరీ ఇంతలా డబ్బులు ఎగరేయాలా.. అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే..

సర్పంచ్‌గా గెలిచిన ఆనందంలో ఆనందం పట్టలేక గాల్లోకి డబ్బులు ఎగరేశాడు ఓ సర్పంచ్‌ అభ్యర్థి. పూణేలోని దావి అనే గ్రామంలో చోటు చేసుకుంది ఈ ఘటన . ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.  గతకొద్ది రోజుల క్రితం.. గ్రామంలో జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందాడు ఓ యువ సర్పంచ్‌. సర్పంచ్ అవ్వడం మనోడికి ఎప్పటినుంచో ఉన్న కలో అయ్యుంటది. ఆ కల ఇప్పుడు నిజమైంది.

ఇంకేముందు.. తన కార్యకర్తలు బ్యాండ్‌ ముందు వీరలెవల్లో డ్యాన్స్‌లు చేస్తుంటే.. స్టేజ్‌పైకి చేరుకున్న సర్పంచ్‌ తన చేతిలో ఉన్న వందరూపాయల నోట్లను గాల్లోకి విసిరేశాడు. ఇక అక్కడితో ఆగకుండా.. ఆ యువ సర్పంచ్‌.. భారీ డీజేను ఏర్పాటు చేసి.. దానిపైకి ఎక్కి మరీ నోట్ల వర్షం కురిపించాడు. దీంతో ఆ గ్రామ ప్రజలంతా.. ఆ నోట్లను ఏరుకోవడం కోసం ఎగబడ్డారు.

ఆ సమయంలో అక్కడ ఉన్న వారు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు దాంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్స్‌ కామెంట్స్‌తో ఆ సర్పంచ్‌ను తెగ ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఇక ఈఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ యువ సర్పంచ్ కు  కాస్త.. లాఠీ రుచి చూపి వదిలేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral News: బాలుడి చెంపపై బల్లి ముద్ర.. అసలు ఎలా వచ్చిందో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు.!

Viral Video: తనను మోసం చేస్తోన్న బాయ్‌ఫ్రెండ్‌కి ఈ అమ్మాయి ఎలా బుద్ధి చెప్పిందో చూడండి.. వైరల్‌గా మారిన వీడియో..