వైరల్ : సరదాకోసం చేసిన సాహసం ప్రాణాలమీదకు తీసికువచ్చింది.. చూస్తే మీరు షాక్ అవుతారు..!!

|

Feb 26, 2021 | 8:07 PM

సరదా కోసం సాహసాలు చేస్తే ప్రాణాలమీదకు వస్తుంది. ఇందుకు ఉదాహరణగా సోషల్ మీడియాలో వేలల్లో వీడియోలు ఉన్నాయి. కొన్నీ నవ్వు తెప్పిస్తాయి కానీ మరి కొన్న వణుకు పుట్టిస్తాయి..

వైరల్ : సరదాకోసం చేసిన సాహసం ప్రాణాలమీదకు తీసికువచ్చింది.. చూస్తే మీరు షాక్ అవుతారు..!!
Follow us on

Viral video : సరదా కోసం సాహసాలు చేస్తే ప్రాణాలమీదకు వస్తుంది. ఇందుకు ఉదాహరణగా సోషల్ మీడియాలో వేలల్లో వీడియోలు ఉన్నాయి. కొన్నీ నవ్వు తెప్పిస్తాయి కానీ మరి కొన్న వణుకు పుట్టిస్తాయి. ఎంతోమంది ఇలా సరదాకోసం చేసిన చాలా పనులు ఎంతో మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. అలాంటి వీడియోలు చేసేంతవరకు బాగానే ఉంటుంది కానీ అనుకోని ప్రమాదం జరిగితే మాత్రం దారుణంగా ఉంటుంది. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటి చక్కర్లు కొడుతుంది.

ఈ వీడియోలో ఓ వ్యక్తి తన భార్యను ఎత్తుకునే ప్రయత్నం చేసాడు. ఆమెను అమాంతం గాలిలోకి లేపి పట్టుకోవలని ప్రయత్నించాడు. కానీ ఆమెను అలా పైకి లేపి ఎక్కువసేపు మోయలేక పోయాడు. దాంతో ఆమె అదుపుతప్పి కింద పడిపోయింది. అయితే కింద పడే సమయంలో ఆమె మెడ భాగం గట్టిగా నేలను తాకింది. శరీర బరువంతా ఆమె మెడ పై పడింది. ఆమె అలా కిందపడటంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఇలాంటి సరదా సాహసాలు చేస్తున్నంత సేపు చూస్తున్నంత సేపు నవ్వుతెప్పిస్తాయి కానీ.. ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. ప్రాణం చాలా విలువైంది .. పోతే తిరిగి రానిది కాబట్టి తస్మాత్ జాగ్రత్త..

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఎప్పుడో రాసిన లెటర్‌‌‌‌‌‌‌కు ఇప్పటికి రిప్లే వచ్చినట్టుందట.. ఇంతకు లెక్కల మాస్టర్‌‌‌‌‌కు లేఖ రాసింది ఎవరో తెలుసా..

రెప్పపాటులో ఘోరం.. సెల్‌ఫోన్ మోజులో ఒకరు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరొకరు.. వీడియో వైరల్.!

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ వేదికలు ఖరారు.. వివరాలు ఇవిగో.!