Telangana: ప్రేమలోనే కాదు.. మరణంలోనూ తోడుగా… గంట వ్యవధిలో దంపతుల మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. వృద్ద దంపతులు నిమిషాల వ్యవధిలో మృతి చెందటం ఆ కుటుంబాన్ని కలచి వేసింది.

Telangana: ప్రేమలోనే కాదు.. మరణంలోనూ తోడుగా... గంట వ్యవధిలో దంపతుల మృతి
Couple Died

Edited By:

Updated on: Aug 16, 2024 | 12:35 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. వృద్ద దంపతులు నిమిషాల వ్యవధిలో మృతి చెందటం ఆ కుటుంబాన్ని కలచి వేసింది. మణుగూరులో నివాసముండే కొమ్ము సోమయ్య తన వ్యవసాయ పొలంలో పనులు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో పొలంలోనే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. మధ్యాహ్నం దాటిన భర్త ఇంటికి రాకపోవడంతో భార్య కొమ్ము శంకరమ్మ, అతని కోసం ఎదురుచూస్తున్న క్రమంలో ఇంటికి సోమయ్య మృతదేహం చేరుకోవడంతో కన్నీరు మున్నీరుగా విలపించింది.

భర్త సోమయ్య మృతి చెందడంతో తట్టుకోలేని శంకరమ్మ నిమిషాల వ్యవధిలోనే గుండెపోటుకు గురై కుప్పకూలిపోయింది. వెంటనే బంధవులు ఆమెను హాస్పిటల్‌కు తరలించినా, అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్ తెలిపారు. దుఃఖంలో ఉన్న ఆ కుటుంబం మరింత కుంగిపోయింది. వీరికి ముగ్గురు కుమారులు అంతా వేరే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. మణుగురు లో అంటూ వ్యవసాయ పనులు చూసుకునే దంపతులు ఇద్దరూ ఇలా గంట వ్యవధిలోనే చనిపోవడంతో అందరిని కలచివేసింది.

ఒకరి తరువాత ఒకరు వృద్ధ దంపతులు మృతిచెందడంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఎంతో అన్యోన్యంగా ఉండే సోమయ్య – శంకరమ్మ దంపతుల మృతితో వారు నివాసముండే బాలాజీ నగర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి, వృద్ధ దంపతుల మృతదేహాలను చూసి బంధువులు, స్థానికులు కన్నీటి పర్యంతం అయ్యారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Loading...
Unable to load recommendations.
Follow Us